ఉచితంగా తిరుమల లడ్డూలు పంపిణీ

by సూర్య | Sat, Mar 21, 2020, 08:38 AM

కరోనా వైరస్ ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రసాదం అయిన లడ్డూలు భారీగా మిగిలిపోయాయి. 2.50లక్షల లడ్డూలు మిగిలాయి. దీంతో వాటిని ఉచితంగా పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం దగ్గర శనివారం(మార్చి 21,2020) టీటీడీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు పంపిణీ చేయనున్నారు.


 


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో టీటీడీ చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో టీటీడీ ఆంక్షలు విధించింది. ఘాట్ రోడ్ మూసివేశారు. ఎగువ ఘాట్ రోడ్‌లో వాహన రాకపోకలు నిషేధించారు. మెట్ల మార్గం కూడా అధికారులు మూసివేశారు. భక్తుల దర్శనాలు నిలిపివేశారు. కరోనా లాంటి జాతీయ విపత్తు దృష్ట్యా.. ప్రజల ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చెప్పింది. దీనికి శ్రీవారి భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది. గ్రహణాల సమయంలో ప్రధాన ఆలయాన్ని మూసివేసినప్పటికీ.. నడక మార్గాన్ని మాత్రం ఇప్పటి వరకూ మూసివేయలేదు. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా అలిపిరి గేట్లను, అలిపిరి చెక్ పోస్టును అధికారులు మూసివేసిన సంగతి తెలిసిందే.


 


 

Latest News

 
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM
చంద్రబాబు ని కలిసిన బత్యాల Tue, Apr 23, 2024, 12:33 PM