జనతా కర్ఫ్యూకు అపూర్వ స్పందన...

by సూర్య | Fri, Mar 20, 2020, 06:59 PM

కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి పౌరులు ఇంటిలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, 'జనతా కర్ఫ్యూ' అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాపారులు తమ వ్యాపారాలను ఆదివారం మూసివేస్తున్నామని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఐఐటి) . వర్తకుల సంఘం శుక్రవారం పేర్కొంది. మార్చి 22 న స్వీయ జనతా కర్ఫ్యూ అని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పిలుపునకు ప్రతిస్పందనగా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఐటి) చేతులు కలిపింది. ప్రధానమంత్రి పిలుపును ప్రశంసించింది అంతేకాదు దేశవ్యాప్తంగా వాణిజ్య మార్కెట్లు జనతా కర్ఫ్యూలో పాల్గొంటాయని తెలిపింది. మార్చి 22 న దేశంలోని ఏడు కోట్ల వ్యాపార సంస్థలు తమ షట్టర్లను మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నాయని సిఐఐటి జనరల్ కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.

Latest News

 
అంధుల డిజిటల్‌ లైబ్రరీని ప్రారంభించిన కలెక్టర్‌ Tue, Apr 16, 2024, 04:00 PM
కూటమి గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చెయ్యాలి Tue, Apr 16, 2024, 03:56 PM
జగన్‌ పై రాయి దాడి కేసులో నిందితులు అరెస్ట్ Tue, Apr 16, 2024, 03:56 PM
ఇక్కడే ఉంటూ.. విదేశాల్లో ఉన్నట్లు మోసం చేస్తున్న వ్యక్తి, అరెస్ట్ చేయాలంటున్న టీడీపీ నేతలు Tue, Apr 16, 2024, 03:55 PM
మహిళ మెడలో బంగారం చోరీ, పెనుగులాటలో మహిళకి గాయాలు Tue, Apr 16, 2024, 03:53 PM