బీజేపీకి మిత్రపక్షం వైసీపీ: పీసీసీ

by సూర్య | Mon, Feb 17, 2020, 08:37 AM

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వైసీపీ అతి విశ్వాసమైన మిత్రపక్షమని పీసీసీ చీఫ్‌ సాకే శైలజనాథ్‌ అన్నారు. వైసీపీ నేతలసీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై ఢిల్లీలో ఒకమాట, అమరావతిలో మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.


విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.. ‘రాష్ట్ర ప్రయోజనాలు’ ప్రతి ఒక్కరికీ ఒక వాడుకపదంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లోగడ చంద్రబాబు ఈవిధంగా ‘రాష్ట్ర ప్రయోజనా’లను ఉపయోగించుకుని ఏమీ సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు.శాసనమండలిని రద్దు చేయాలని ఢిల్లీ పెద్దలను కోరడం రాష్ట్ర ప్రయోజనమా అని సీఎం జగన్‌ను నిలదీశారు. ఒకపక్క బీజేపీ ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని చెబుతున్నా వాళ్ల కాళ్లు పట్టుకోవడానికి గల కారణం ఏమిటని అడిగారు.రాజధాని అమరావతిపై బీజేపీ నేతలు నచ్చినట్లుగా ప్రకటన చేస్తూ నాటకాలు ఆడుతున్నారని శైలజానాథ్‌ విమర్శించారు.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM