ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

by సూర్య | Sun, Feb 16, 2020, 02:57 PM

ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. ఇంటింటికీ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టింది. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి వచ్చి కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారు. వీలైనంత త్వరగా కొత్త బియ్యం కార్డుల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే కొత్త రేషన్ కార్డుల ద్వారానే జగన్ హామీ ఇచ్చిన నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు ఇవ్వబోతున్నారు. అలాగే రేషన్ సరుకులు కూడ ఇంటి వద్దకే గ్రామ వాలంటీర్లు అందించనున్నారు. దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ వాలంటీర్ల రాక ఆలస్యమైనా ఆందోళన అవసరం లేదని అధికారుల చెబుతున్నారు. రేషన్ కార్డుపై తహశీల్ధార్ డిజిటల్ సంతకం తప్పనిసరి కాబట్టి.. కాస్తా ఆలస్యమైనా రేషన్ కార్డులు ఇంటికి వస్తాయంటున్నారు. వారం దాటితే కాల్ చేసి గ్రామ, వార్డు వాలంటీర్లను అడగాలని ప్రజలకు సూచిస్తున్నారు. టీడీపీ హయంలో భారీ ఎత్తున తెల్ల రేషన్ కార్డుల పంపిణీ జరిగిందని.. అనర్హులకు కూడ వైట్ రేషన్ కార్డులు ఇచ్చారని జగన్ ప్రభుత్వం భావించింది. అందుకే అనర్హులను ఏరివేసి అర్హులకు మాత్రమే కొత్త బియ్యం కార్డులను ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త రేషన్ కార్డుదారులకు మాత్రమే ఇకపై రేషన్ సరుకులు ఇవ్వనున్నారు.
కొత్త రేషన్ కార్డులు లేకపోతే ఇతర పథకాలు అందవేమోనన్న అనుమానాలు, ఆందోళనలకు ప్రభుత్వం చెక్ చెప్పింది. పింఛన్లు, ఆరోగ్య శ్రీ, జగనన్న దీవెన, అమ్మఒడి లాంటి పథకాలకు కొత్త రేషన్ కార్డుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాలకు గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని అన్నారు. ఏప్రిల్ 1 నుంచీ కొత్త రేషన్ కార్డులపై నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM