రూ.10 వేల పెట్టుబడితో కోటీశ్వరులయ్యే ఛాన్స్

by సూర్య | Sun, Feb 16, 2020, 01:19 PM

సరిగ్గా పదేళ్ల క్రితం ఓ పదివేలు మనవి కాదనుకొని ఈ స్టాక్స్ మీద పెట్టుబడి పెట్టి ఉంటే కోట్లు మీ సొంతం అయ్యేవి. ఆశ్చర్యపోతున్నారు కదూ.. చెప్పుల తయారీ కంపెనీలు గత కొన్ని సంవత్సరాలుగా ఔట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సెక్టార్ లో పోటీ పరిమితంగా ఉండటంతో పాటు మార్కెట్లో వీటి విస్తరణ కూడా అంతే స్థాయిలో ఉంది. అయితే తాజాగా బడ్జెట్ లో చెప్పులు, బూట్లు ఇతర ఫుట్ వేర్ ను విదేశీ దిగుమతులపై పన్నులు పెంచేయడంతో ప్రస్తుతం ఈ సెక్టార్ కు మరింత కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. ఫుట్ వేర్ సంస్థకు చెందిన కొన్ని స్టాక్స్ చూసినట్లయితే గత పదేళ్లలో రిలాక్సో ఫుట్ వేర్స్ అనే సంస్థ ఏకంగా 7,907 శాతం జంప్ అయ్యింది. సరిగ్గా పదేళ్ల క్రితం అంటే ఫిబ్రవరి 6, 2010 నాటికి దాని షేర్ ధర రూ.9.30 పలికింది. ఆ సమయంలో ఈ షేర్ మీద రూ.10 వేలు పెట్టుబడి పెట్టి ఉంటే, 2020 ఫిబ్రవరి 6 నాటికి ఈ షేర్ విలువ రూ.800 పలికింది. అంటే మీ డబ్బు రూ.8 లక్షలు అయ్యి ఉండేది. పదేళ్ల క్రితం బాటా ఇండియా 2010 ఫిబ్రవరి 6 నాటికి రూ.110 పలకగా, ప్రస్తుతం అంటే ఫిబ్రవరి 06, 2020 నాటికి రూ.1821 పలుకుతోంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM