బీజేపీతో దోస్తికి పవన్ కటీఫ్..?

by సూర్య | Sun, Feb 16, 2020, 12:54 PM

ఏపీలో బీజేపీతో పవన్ కళ్యాణ్ కలవడంతో రాజకీయ పరిణామాలు మారతాయని అంతా భావించారు. వైసీపీ విధానాలపై ఉమ్మడిగా పోరాడాలని బీజేపీ, జనసేనలు నిర్ణయం తీసుకున్నాయి. రాజధానికి మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. తెర వెనక ఏం జరిగిందో కానీ ఆ లాంగ్ మార్చ్ ను వాయిదా వేశారు. పవన్ ఇటీవలే కర్నూల్ జిల్లాలో అత్యాచార బాధితురాలికి మద్దతుగా సభను నిర్వహించారు. కానీ కాషాయ శ్రేణులు జనసేనాని పర్యటనలో కనిపించలేదు. శనివారం రోజు అమరావతి గ్రామాల్లో పవన్ పర్యటించారు. అక్కడ కూడ బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ పర్యటనకు దూరంగానే ఉన్నారు.
దీంతో జనసేన, బీజేపీ మధ్య పొత్తుకు ఆదిలోనే బీటలు వారాయని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. అయితే ఏపీ సీఎం జగన్ వల్లే పవన్ బీజేపీకి దూరంగా ఉంటున్నారట. కొంతకాలంగా జగన్‌కు బీజేపీ కేంద్ర పెద్దలు ఇస్తున్న ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ కు నచ్చడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీనికి తోడు వైసీపీ ఎన్డీయేలోకి ఎంట్రీ ఇచ్చి.. కేంద్ర కేబినెట్లో చేరతారని ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీపై క్లారిటీ వచ్చే వరకు బీజేపీకి జనసేనాని దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM