ఆపిల్ తినడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

by సూర్య | Sat, Feb 15, 2020, 07:25 PM

రోజూ ఒక ఆపిల్ పండు తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి అవసరం ఉండదు అనే మాట మనం విని ఉంటాము. చాలా మంది పేషెంట్స్ కి డాక్టర్స్ ఆపిల్ తినమని సలహా ఇస్తుంటారు. మనలో చాలా మందికి ఆపిల్ తినటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో తెలియవు. అసలు ఎందుకు ఆపిల్ ని డాక్టర్స్ తినమని సలహా ఇస్తుంటారో మీకు తెలుసా? ఇప్పుడు ఆపిల్ తినడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
1. బరువు తగ్గటం : ఆహారం తీసుకునే ముందు ఆపిల్ ని తిన్నట్లయితే కడుపు నిండినట్లు అయి తక్కువగా తింటాము. ఆపిల్ లో తక్కువ క్యాలోరీస్ మరియు ఫైబర్ కూడా మంచి మోతాదులో ఉండటం వల్ల బరువు తగ్గడానికి దోహదపడుతుంది. తినే ముందు ఆపిల్ ని తినడం వల్ల దాదాపు మనం 200 క్యాలోరీస్ తక్కువ తినే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆహారం తీసుకునే అరగంట ముందు పండ్లు తినడం మంచిది.
2. గుండె ఆరోగ్యం : ఆపిల్ మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా సహాయ పడుతుంది, కొంత మంది శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం సేబు పండు గుండె పోటు రాకుండా కాపాడుతుంది. ఆపిల్ లో ఫైబర్ ఉండటం వల్ల రక్త నాళాలలో పేరుకునే చెడు కొవ్వుని తగ్గిస్తుంది. మెడిసిన్స్ ఎలాగైతే గుండె పోటు రాకుండా కాపాడుతాయో అలాగే ఆపిల్ కూడా అంతే మంచిగా కాపాడుతుంది.
3. మధుమేహం : ఈ రోజుల్లో చిన్న వయసునుండి ముసలి వాళ్ళ దాక తేడా లేకుండా షుగర్ లేదా డయాబెటిస్ అనే రోగం బారిన పడుతున్నారు. షుగర్ వ్యాధి ఇన్సులిన్ తగ్గడం వల్ల వస్తుంది.
4. క్యాన్సర్ : కొన్ని అధ్యయనాల ప్రకారం ఆపిల్ లో ఉండే యాంటియాక్సిడెంట్స్ కాన్సర్ జబ్బు నుండి మరణించడాన్ని నివారిస్తుందని తేలింది.
5. ఎముకల సామర్థ్యం : మన వయసు పెరిగే కొద్దీ మన ఎముకల సామర్థ్యం తగ్గుతుంది,నేల పై కూర్చోవడం కూడా కష్టంగా మారుతుంది అందుకే చాలా మంది కుర్చీల పైనే కూర్చోవడానికి ఇష్టపడతారు. ఆపిల్స్ లో యాంటీయాక్సిండెంట్స్ మరియు యాంటీ ఇన్ఫామెంటరీ సమ్మేళనాలు ఎముకల సామర్త్యాన్ని పెంచుతుంది.
6. మెదడు : చిన్న పిల్లలు ఏదైనా చుసిన విన్న త్వరగా గుర్తుపెట్టుకునే శక్తి ఉంటుంది,కాని అదే వయసు పై బడిన వారి లో జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గి పోతూ ఉంటుంది కానీ ఆపిల్ తినే వారిలో మాత్రం మెదడు కి సంభందించిన రోగాల నుండి కాపాడుతుంది. ఒక పరిశోధన లో ముసలి ఎలుకలకు ఆపిల్ తినిపించిన తర్వాత వాళ్ళ జ్ఞాపక శక్తి యవ్వనం లో ఉండే ఎలుకల లాగా మారింది. ముసలి వాళ్ళలో ఆపిల్ జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
7. ఊబకాయం : బరువు పెరగటం అనేది ఈ రోజుల్లో ఒక సాధారణమైన విషయం అయిపోయింది. చాలా మంది తక్కువ వయసులో పొట్ట రావటం వల్ల బాధ పడుతూ ఉంటారు. ఆపిల్ తినటం వల్ల ఊబకాయం బారిన పడకుండా సహాయ పడుతుంది.
8. జీర్ణ సమస్యలు : ఆపిల్ లో ఉండే ఫైబర్ త్వరగా జీర్ణం అవ్వదు ఫలితంగాకడుపులో ఉండే మంచి బాక్టీరియా పెరుగుదలకు ఆపిల్ లో ఉండే ఫైబర్ సహాయ పడుతుంది.
9. మలబద్దకం సమస్యలు : కొంత మందికి మలం సరిగా రాదు, వచ్చినట్లు అనిపిస్తుంది కాని రాదు ఇలాంటి వారు ఆపిల్ తిన్నట్లైతే కాంస్టీపేసెంట్స్ సమస్య ఉండదు. ఆపిల్ లో పెక్టిన్ అనే ఫైబర్ శరీరంలో జీర్ణ సమస్యలను నివారిస్తుంది.
10. శరీరంలోని కొవ్వు : మనలో చాలా మంది జంక్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు. ఫలితంగా శరీరంలో కొవ్వు బాగా పెరుగుతుంది. ఇలా పెరిగిన కొవ్వు గుండె పోటు కి కూడా దారి తీయవచ్చు. ఆపిల్ తినడం వల్ల శరీంలో మరియు రక్తం లోని కొవ్వు నియంత్రణలో ఉంటుంది.

Latest News

 
యువకుని శవం లభ్యం Fri, Mar 29, 2024, 12:48 PM
వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి Fri, Mar 29, 2024, 12:18 PM
ఎన్ని కష్టాలు వచ్చినా టీడీపీ వెంటే పరిటాల కుటుంబం: సునీత Fri, Mar 29, 2024, 12:09 PM
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ రెండు రోజులుగా తనిఖీలు Fri, Mar 29, 2024, 12:06 PM
పూర్తి స్థాయిలో అమలు కానీ ఎన్నికల కోడ్ Fri, Mar 29, 2024, 12:05 PM