సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై దేవినేని సంచలన వ్యాఖ్యలు

by సూర్య | Sat, Feb 15, 2020, 06:48 PM

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అనంతరం ఎన్ని నిధులు తెచ్చారు అని దేవినేని ప్రశ్నించారు? రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై దేవినేని మాట్లాడుతూ జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదని అన్నారు. రైతులకు తగిన గిట్టుబాటు ధర రావడంలేదన్నారు. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడంలేదని ఆరోపించారు. దళారులు రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతుల దీన పరిస్థితిపై వ్యవసాయమంత్రి, మార్కెటింగ్ మంత్రి.. సీఎం పట్టించుకోవడంలేదన్నారు.
సుబాబుల్, ధాన్యం రైతులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. మిర్చీ రైతులు దోపిడికి గురవుతున్నారన్నారు. ఏడు సార్లు ఢిల్లీ వెళ్లారు. నాలుగు సార్లు ప్రధానిని కలిశారు. ఎన్ని నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చారు అని వైసీపీ నేత లను ప్రశ్నించారు. 2018-19లో అత్యధిక ప్రవేటు పెట్టుబడులు ఏపీ కి వచ్చాయన్నారు. పెట్టుబ డుల ఆకర్షణలో తొలి రెండు స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్ ఉన్నాయన్నారు.
ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు. దీనిపై మీరేమంటారని దేవినేని రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.70వేల కోట్లకు పైగా పెట్టు బడులు తీసుకొచ్చిందన్నారు.  వైసీపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో లక్షా ఎనబైవేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రంనుంచి బయటకు వెళ్లిపోయాయన్నారు. ఇవన్నీ ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలేనని దేవినేని పేర్కొన్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM