మహిళలందరూ 'దిశ' యాప్ వేసుకొని పోలీసుల సహకారం పొందండి: ఎస్పీ

by సూర్య | Sat, Feb 15, 2020, 05:19 PM

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీసు కార్యాలయంలో శనివారం ఉదయం జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ మాట్లాడుతూ... అక్క చెల్లెల్లు అందరూ దిశ యాప్‌ ను ఆండ్రాయిడ్‌ ఫోన్లలో డౌన్లోడ్‌ చేసుకుని పోలీసుల సహకారాన్ని పొందాలని కోరారు. 10 నిమిషాల్లో బాధితుల వద్దకు పోలీసులు కచ్చితంగా చేరుకుంటారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొట్టమొదటి దిశ యాప్‌ ఎస్‌ఓఎస్‌ కేసు పశ్చిమలో నమోదయిందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. 48 గంటల్లో ఛార్జిషీట్‌ పూర్తి చేశామన్నారు. పోలీసుశాఖ ఎప్పుడూ మహిళలకు అండగా నిలుస్తుందని, మహిళల రక్షణ ధ్యేయంగా పని చేస్తున్నామని అన్నారు. ఎస్‌ఓఎస్‌ కాల్‌ తో మరింత వేగంగా బాధితుల వద్దకు చేరుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా దిశ యాప్‌ గురించి ఒకరితో ఒకరు పంచుకోవాలని పేర్కొన్నారు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM