రాజధాని తరలింపుపై కేంద్రం వద్ద కూడా జగన్‌కు మద్దతు లభించలేదు: యనమల

by సూర్య | Sat, Feb 15, 2020, 03:30 PM

రాజధాని తరలింపు, మండలి రద్దు అంశాలపై కేంద్రం వద్ద కూడా జగన్‌కు మద్దతు లభించలేదని మండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానిగా కొనసాగాలనేది న్యాయమైన అంశమని, వైసీపీ తప్ప రాష్ట్ర ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వైసీపీ మండలి కార్యదర్శిని కూడా నియంత్రిస్తోందని విమర్శించారు. మండలి ఛైర్మన్‌ ఆదేశాలనూ పాటించకుండా చేస్తోందని, ఇది సభా నియమాలకు విరుద్ధమన్నారు. సెలెక్ట్‌ కమిటీ దస్త్రాన్ని మళ్లిd వెనక్కి పంపడంతో కార్యదర్శి సభా నియమాల ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు. చైర్మన్‌, సభాపతికి శాసన పరిషత్‌ ఇచ్చిన అధికారాలు ఎవ్వరూ ధిక్కరించలేనివన్నారు. సభ్యులకే వీటిని ధిక్కించే అధికారం లేనప్పుడు ఇక కార్యదర్శికి ఎక్కడుంటుంది? అని ప్రశ్నించారు. క్రమశిక్షణాచర్యల కింద కఠిన నిర్ణయం తీసుకునే అధికారం చైర్మన్‌కు ఉందన్నారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM