మార్చిలో 11 రోజులు బ్యాంకులు పనిచేయవ్..

by సూర్య | Sat, Feb 15, 2020, 01:01 PM

బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్‌ఐ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎ.ఐ.బి.ఇ.ఎ) ప్రకారం.. భారత బ్యాంకుల సంఘాలతో వేతన సవరణ చర్చల తరువాత మార్చి 11 నుండి 13 వరకు 3 రోజుల అఖిల భారత బ్యాంకు సమ్మెను పాటిస్తారు. డిమాండ్లు సాధించుకోవడంలో ఐబిఎ విఫలమైంది. దీంతో మూడు రోజుల బ్యాంకు సమ్మె తర్వాత రెండవ శనివారం, ఆదివారం కలుపుకుని మొత్తంగా ఐదు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఈసారి జరగబోయే సమ్మెకు ప్రాధాన్యం ఉంది.12.25 శాతం వేతనాల పెంపు, స్పెషల్ అలవెన్స్‌ను బేసిక్ పేలో కలపడం, వారానికి 5 రోజుల పని దినాలపై ఐబీఏ ఇచ్చిన ఆఫర్‌పై అంగీకారం కుదరలేదు. 9 ట్రేడ్ యూనియన్లతో కూడిన యూఎఫ్‌‌బీయూ, తమ డిమాండ్లను అంగీకరించకపోతే మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజులపాటు సమ్మె చేస్తామని హెచ్చరించింది. అప్పటికీ తమకు ఉపశమనం కలగకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని పేర్కొంది. యూఎఫ్‌‌బీయూ రాష్ట్ర కన్వీనర్ సిద్ధార్థ ఖాన్ మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంతేకాదు మార్చి 10 న హోలి ఉంది. మార్చిలో మొత్తం 5 ఆదివారాలు వస్తాయి. 14 వ తేది, 28 వ తేదిన రెండవ శనివారం, నాల్గవ శనివారాలు వస్తాయి. మొత్తంగా తీసుకున్నట్లైతే మార్చిలో 11 రోజులు బ్యాంకులు ఉండవు. దీనిని గమనించి బ్యాంకు పనులు ఏవైనా ఉంటే ముందే పూర్తి చేసుకోవడం ఉత్తమం.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM