సీఎం అభ్యర్థిగా ప్రశాంత్ కిషోర్?

by సూర్య | Fri, Feb 14, 2020, 04:48 PM

ప్రధాని మోదీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. పాతికమందికిపైగా కేంద్ర మంత్రులు.. 200 మంది ఎంపీలు.. 10 మంది ముఖ్యమంత్రులు.. వేల మంది కాషాయ సైనికులు.. వీళ్లందరినీ ఢీకొట్టిమరీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇప్పుడొక సరికొత్త క్రేజీ ఎత్తుగడను ప్రయోగించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.ఆప్ గెలుపులో అరవింద్ కేజ్రీవాల్ కు అన్ని రకాలుగా తోడ్పాడు అందించిన ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ బహిషృత నేత ప్రశాంత్ కిషోర్ ను ఏకంగా ముఖ్యమంత్రిని చేసేలా ప్రణాళికలు రూపొందుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన కీలక ప్రకటన ఈనెల 18న వెల్లడికానుంది. ప్రకటన విషయాన్ని సాక్షాత్తూ పీకేనే మీడియాకు చెప్పడం ఉత్కంఠను రెట్టింపు చేసింది.


కెరీర్ ప్రారంభంలో ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి లాంటి విశిష్ట సంస్థల్లో పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. చిన్న పిల్లల్లో పౌష్టికాహార లోపాలపై ఓ ఆర్టికల్ రాయడం.. అందులోని అంశాలు వినూత్నంగా ఉండటంతో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ.. పీకేను పిలిపించుకుని మాట్లాడటం.. క్రమంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలు, పనితీరుపై విశ్లేషణలు చేసే స్థాయికి పీకే ఎదగడం చకచకా జరిగిపోయాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీకి అడపాదడపా సలహాలిచ్చిన ప్రశాంత్ కిషోర్.. 2014 ఎన్నికలకు ముందు నుంచి ఆయన పూర్తిస్థాయి స్ట్రాటజిస్టుగా మారిపోయారు. మోదీని ప్రధాని అభ్యర్థిగా బలంగా ప్రమోట్ చేయడంలో, కొత్తరకం ప్రచారంతో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి విజయం అందించడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాతి ఏడాదికే(2015లో) మోదీ, బీజేపీకి వ్యతిరేకంగానూ వ్యూహాలు రచించి విజయం సాధించారు. ఇక ప్రస్తుత విషయానికొస్తే.ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తమ టార్గెట్ బీహార్ అని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. బీహార్ లో పుట్టిపెరిగి, అక్కడి రాజకీయాలు అణువణువూ తెలిసిన ప్రశాంత్ కిషోర్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆప్ నిలబెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందటే పీకేతోపాటు జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన పవన్ వర్మ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆప్ సారధ్యంలో బీహార్ లో కొత్త రాజకీయాలు చూడబోతున్నారని పవన్ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 8 నెలలే గడువు ఉండటంతో ఇప్పటి నుంచే పని మొదలుపెట్టాలని ఆప్ భావిస్తున్నట్లు తెలిసింది.


జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత చాలా కాలంపాటు సైలెంట్ గా ఉండిపోయిన ప్రశాంత్ కిషోర్.. తన రాజకీయ భవిష్యత్తుపై 18న ప్రకటన చేస్తానని చెప్పారు. అంతకుముందు పలు చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ తాను ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా ఉండాలనుకుంటున్నానని, ఎన్నికల వ్యూహాలు రచించే ‘ఐ ప్యాక్' సంస్థలో నేరుగా పనిచేయడం మానేస్తానని పీకే చెప్పారు. సమాజంలో మార్పుల కోసం తాను సూచిస్తోన్న అంశాలను అన్ని పార్టీలు ప్రచారానికి వాడుకుని వదిలేస్తున్నాయని, తన సలహాల్లో కనీసం కొన్నింటినైనా అమలుచేస్తే ప్రజలకు గొప్ప మేలు జరుగుతుందని పీకే అన్నారు. నేరుగా తానే రాజకీయ నేతగా మారితే ఐడియాల ఇంప్లిమెంటేషన్ ఈజీ అవుతుంది కాబట్టి సొంత రాష్ట్రానికి చెందిన జేడీయూలో చేరానని ఆయన గుర్తుచేశారు. గడిచిన రెండేళ్లుగా పాట్నాలోనే ఉంటోన్న పీకే.. బీహార్ లోని మూలమూలకూ తిరిగి పెద్ద సంఖ్యలో యువతను సమీకరించారు. క్షేత్రస్థాయిలో పీకే చేసిన పని అతని సీఎం అభ్యర్థిత్వానికి ప్లస్ అవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. ఇంకా వాళ్ల ప్లాన్ ఏంటంటే

Latest News

 
బస్సు బోల్తా.. డ్రైవర్ తో సహా ఆరుగురుకి గాయాలు Thu, Apr 25, 2024, 12:20 PM
వైసిపి టిడిపి నుండి 60 కుటుంబాలు కాంగ్రెస్ లోకి చేరిక Thu, Apr 25, 2024, 12:18 PM
వైసిపి నుండి 10 కుటుంబాలు టిడిపిలోకి చేరుకా Thu, Apr 25, 2024, 12:10 PM
వైఎస్సార్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగభూషణ Thu, Apr 25, 2024, 12:09 PM
కొనసాగిన నామినేషన్ల పర్వం Thu, Apr 25, 2024, 12:06 PM