చంద్రబాబు హయాంలో పెద్ద కుంభకోణం ...

by సూర్య | Fri, Feb 14, 2020, 02:08 PM

ఆదాయపన్ను శాఖ దాడుల్లో వెలుగు చూసిన రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌కు తెలిసే అవినీతి జరిగిందని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా జరుగుతన్న ఐటీ దాడులను బట్టి ఈ విషయం స్పష్టమైందన్నారు. చంద్రబాబు హయాంలో పెద్ద కుంభకోణం జరిగిందని, నేరస్తుల మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు వ్యక్తిగత మాజీ కార్యదర్శి నివాసంలో సోదాలు చేస్తేనే రెండు వేల కోట్ల బయటపడితే.. చంద్రబాబు, లోకేశ్‌లపై దాడులు చేస్తే ఎన్ని వేల కోట్లు బైటపడతాయోనని ఆశ్చర్యపోయారు. చంద్రబాబు నాయుడు మీదనే కాదు టీడీపీ నాయకులు మీద కూడా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు.

Latest News

 
వైఎస్ వివేకా హత్య కేసులో సంచలనం.. చంద్రబాబు, పవన్, షర్మిల, సునీతలకు కోర్టు కీలక ఆదేశాలు Thu, Apr 18, 2024, 07:36 PM
ఓ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు.. అట్ట పెట్టెల్లో గుట్టు, పెద్ద ట్విస్టే ఇది! Thu, Apr 18, 2024, 07:33 PM
నెలకు రూ.25వేలు అకౌంట్‌లో వేశారు.. లాభం అని సంబరపడితే ఇదేం ట్విస్ట్ Thu, Apr 18, 2024, 07:30 PM
తిరుమల శ్రీవారి ఆలయం ముందు కర్ణాటక భక్తుడి ఓవరాక్షన్.. ఆమె ఫోటోతో అత్యుత్సాహం Thu, Apr 18, 2024, 07:27 PM
టీటీడీ కీలక నిర్ణయం.. అక్కడ కూడా అన్నప్రసాదం ప్రారంభం.. టైమింగ్స్, మెనూ ఇవే Thu, Apr 18, 2024, 07:24 PM