మోదీ-జగన్ భేటి జరిగిన మరుసటి రోజే సంచలనం

by సూర్య | Fri, Feb 14, 2020, 12:31 PM

ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడి-ఏపీ సీఎం జగన్ భేటి జరిగిన మరుసటి రోజే తెలుగురాష్ట్రాల్లో పెద్ద సంచలనం మొదలైంది. చంద్రబాబునాయుడు దగ్గర పిఎస్ పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ ఇంటిపై జరిపిన సోదాల్లో ప్రాధమికంగా సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన బ్లాక్ మనీ లావాదేవీలను గుర్తించినట్లు ఐటి శాఖ అధికారికంగా ప్రకటన చేయటమే సంచలనానికి ప్రధాన కారణమైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మోడి-జగన్ భేటి జరిగిన మరుసటి రోజే ఐటి శాఖ ప్రెస్ రిలీజ్ చేయటం. అంటే అప్పటికే శ్రీనివాస్ పై ఐటి అధికారులు ఐదురోజుల పాటు సోదాలు జరిపారు లేండి. నిజానికి శ్రీనివాస్ జీఏడి విభాగంలో స్టాటిస్టికల్ అధికారి. మాత్రమే. కానీ చేస్తున్న ఉద్యోగంపైన కాకుండా చంద్రబాబుకు ఐదేళ్ళు పిఎస్ గా పనిచేశాడన్న విషయమే చాలా కీలకం. ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఐదేళ్ళ పాటు శ్రీనివాసే కళ్ళు, చెవులు గా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే.
జాతీయ స్ధాయిలో చంద్రబాబు చక్రం తిప్పింది లేంది తెలీదు కానీ శ్రీనివాస్ మాత్రం ఐదేళ్ళు చక్రం తిప్పింది మత్రం వాస్తవం. ఇటు పార్టీతో పాటు అటు ప్రభుత్వంలో ఈ మాజీ పిఎస్ చెప్పిందే వేదంగా సాగింది. ఇంతటి కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ పై ఐటి అధికారుల దృష్టి పడటమే గమనార్హం. పెండ్యాలపై ఐటి అధికారులు దాడులు చేశారంటే దాదాపు చంద్రబాబు ఇంటిపై దాడులు చేసినట్లుగానే భావించాల్సుంటుంది.
ఎందుకంటే చంద్రబాబు తరపున దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు తదితరాలతో టచ్ లో ఉన్నది ముందుగా పెండ్యాలే కాబట్టి. అదే సమయంలో ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేసిన దగ్గర నుండి ఐటి అధికారులు పెండ్యాల వ్యవహారాలను ఓ కంట గమనిస్తునే ఉన్నారట. అందుకనే అదునుచూసి దాడులు చేయటం అదికూడా ఏకంగా ఐదురోజుల పాటు సోదాలు జరపటంతో సంచలనమైంది. దానికితోడు మోడి-జగన్ భేటి జరిగిన మరుసటి రోజే ఐటి విభాగం అధికారికంగా ప్రెస్ రిలీజ్ చేయటంతో సంచలనం మొదలైంది.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM