కొత్త ఆదాయపు పన్ను రేట్లు వల్ల నష్టం ఏంటంటే ?

by సూర్య | Thu, Feb 13, 2020, 06:47 PM

యూనియన్ బడ్జెట్‌ 2020లో కొత్త ట్యాక్స్ స్లాబ్‌లను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రత్యక్ష పన్ను విధానంలో దీన్ని ఒక విప్లవాత్మకమైన చర్యగా అభివర్ణించొచ్చు. మోడీ సర్కార్ కొత్త పన్ను చెల్లింపు విధానంలో 7 నూతన ట్యాక్స్ స్లాబులను ప్రకటించారు. రూ.2.5 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. రూ.2,50,001 నుంచి రూ.5 లక్షలలోపు ఆదాయంపై 5 శాతం పన్ను పడుతుంది. దీన్ని రిబేట్ పొందొచ్చు. రూ.5,00,001 నుంచి రూ.7.5 లక్షల వరకు ఆదాయం ఉంటే 10 శాతం పన్ను పడుతుంది. రూ.7,50,001 నుంచి రూ.10 లక్షలలోపు ఆదాయంపై 15 శాతం ట్యాక్స్ కట్టాలి. రూ.10,00,001 నుంచి రూ.12.5 లక్షలలోపు ఆదాయంపై 20 శాతం, 12,50,001 నుంచి రూ.15 లక్షలలోపు ఆదాయంపై 25 శాతం పన్ను, రూ.15 లక్షలకు పైన ఇన్‌కమ్‌పై 30 శాతం ట్యాక్స్ పడుతుంది. సర్‌చార్జ్, సెస్ వంటివి పన్ను రేటుకు అదనంగా చెల్లించాలి. రూ.2.5 లక్షల వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలలోపు ఆదాయం ఉంటే 5 శాతం పన్ను ఉంటుంది. దీనిపై రూ.2,500 నుంచి రూ.12,500 వరకు రిబేట్ పొందొచ్చు. రూ.5,00,001 నుంచి రూ.10 లక్షలలోపు ఆదాయంపై 20 శాతం ట్యాక్స్ కట్టాలి. రూ.10 లక్షలకు పైన 30 శాతం పన్ను పడుతుంది. వీటికి అదనంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సస్ 4 శాతంగా ఉంటుంది. సర్‌చార్జ్ విషయానికి వస్తే రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్లకు పైగా ఆదాయంపై 10 శాతం నుంచి 37 శాతం సర్‌చార్జ్ పడుతుంది. రూ.5 లక్షల పన్ను ఆదాయంపై ఎలాంటి ప్రభావం ఉండదు. పాత పన్ను చెల్లింపు విధానంలో ఎలాగైతే జీరో ట్యాక్స్ ఉంటుందో.. కొత్త విధానంలో కూడా ఎలాంటి పన్ను పడదు. రూ.7.5 లక్షల పన్ను ఆదాయంపై కొత్త పన్ను చెల్లింపు విధానంలో రూ.78,000 తక్కువ ట్యాక్స్ పడుతుంది. రూ.10 లక్షల ట్యాక్సబుల్ ఇన్‌కమ్‌పై కూడా కొత్త పన్ను చెల్లింపు విధానంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. పాత పన్ను చెల్లింపు విధానంతో పోలిస్తే కొత్త దానిలో రూ.39,000 వరకు ఆదా అవుతుంది. అదే రూ.12.5 లక్షల పన్ను ఆదాయంపై కొత్త పన్ను చెల్లింపు విధానంలో రూ.65,000 వరకు తక్కువ ట్యాక్స్ చెల్లించొచ్చు. రూ.15 లక్షల ట్యాక్సబుల్ ఆదాయంపై రూ.78 వేల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. మీరు రూ.20 లక్షల పన్ను ఆదాయం కలిగి ఉంటే.. కొత్త ట్యాక్స్ చెల్లింపు విధానంలో కూడా రూ.78,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మోడీ సర్కార్ ఆవిష్కరించిన కొత్త పన్ను చెల్లింపు విధానంలో చాలా పన్ను మినహాయింపులను కోల్పోవలసి వస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు, సెక్షన్ 80డీ కింద రూ.25,000 వరకు, రూ.2 లక్షల వరకు హోమ్ లోన్ వడ్డీ రేటు వంటి పలు మినహాయింపులన్నీ ఉండవు.

Latest News

 
కొనకనమిట్ల మండలంలో ఎమ్మెల్యే అన్నా ఎన్నికల ప్రచారం Fri, Mar 29, 2024, 01:09 PM
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు Fri, Mar 29, 2024, 01:06 PM
రైతు పై ఎలుగుబంటి దాడి Fri, Mar 29, 2024, 01:04 PM
కంబదూరులో పిల్లవాడి కిడ్నాప్ యత్నం విఫలం Fri, Mar 29, 2024, 01:00 PM
టిప్పర్ ఢీకొని యువకుడు మృతి Fri, Mar 29, 2024, 12:57 PM