జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం !

by సూర్య | Thu, Feb 13, 2020, 06:01 PM

ఏపీ అసెంబ్లీ,మండలిలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సభలను ప్రొరోగ్ చేయడం ద్వారా ఏపీ సర్కార్ కు ఆర్డినెన్సులు జారీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ బిల్లు రద్దు వంటి వాటికి సంబంధించి సెలక్ట్ కమిటి ఏర్పాటైన విషయం తెలిసిందే. సభలను ప్రోరోగ్ చేయడం ద్వారా ఇప్పుడు అవి ఏవి కూడా పని చేయవు. దీనిని ఆసరాగా చేసుకొని మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు రాకుండా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. తర్వాతి కేబినేట్ లోనే దీని పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిపక్షాలకు షాకిచ్చేలా సీఎం జగన్ రాజధానుల ఏర్పాటు పై దూకుడు పెంచారు. గతంలో కేంద్ర ప్రభుత్వం బిల్లులు సభలో ఉండగానే ప్రొరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకువచ్చిన పలు అంశాలను ఏపీ సర్కార్ ఉదాహారణగా చూపుతుంది.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM