మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడల్ షియోమి మి10

by సూర్య | Thu, Feb 13, 2020, 04:58 PM

స్మార్ట్‌ఫోన్ల రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న షియోమి సంస్థ కొత్త కొత్త ఫోన్లతో తన వైపు అందరిని ఆకట్టుకుంటోంది. ఇప్పుడు కూడా షియోమి మి10ను కొత్తగా లాంచ్ చేసింది. చైనాలో జరిగిన లాంచ్ ఈవెంట్ కార్యక్రమంలో ప్రపంచంలోనే మొట్టమొదటి 108MP కెమెరా గల మి10 కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. షియోమి సంస్థ ఇంతకు ముందు గల తన మి9 స్మార్ట్‌ఫోన్‌కు అప్ డేట్ వెర్షన్ గా మి10ను లాంచ్ చేసింది. సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లలో మి10 ఫోన్ 108 మెగాపిక్సెల్ సెన్సార్‌తో పాటు వై-ఫై6కి మద్దతు ఇస్తుంది. ఇది 5G కనెక్టివిటీ ఎంపికతో పాటుగా ఇప్పుడు మార్కెట్ లో అత్యుత్తమంగా ఉన్న క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్‌తో వస్తుంది. షియోమి మి10 స్మార్ట్‌ఫోన్‌ ధర చూస్తే రూ.3999 నుండి మొదలవుతుంది. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని యొక్క విలువ సుమారు రూ.40,910. ఈ ధర 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం నిర్ణయించబడింది. మి10 మొత్తంగా మూడు వేరియంట్ లలో విడుదల అయింది. ఇందులో 8 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజ్ మోడల్ యొక్క ధర 43,980 రూపాయలు కాగా 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.48,080. షియోమి యొక్క సరికొత్త మి10 స్మార్ట్‌ఫోన్‌ 1,120 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల ఎఎంఒ ఎల్ఇడి డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ యొక్క ముందు భాగంలో సింగిల్ హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్‌తో వస్తుంది. మి10 స్మార్ట్‌ఫోన్‌ యొక్క ప్యానెల్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ నమూనా రేటుకు మద్దతు ఇస్తుంది. కొత్తగా ప్రారంభించిన మి10 యొక్క డిస్ప్లే 5000000: 1 యొక్క కాంట్రాస్ట్ రేషియోను అందిస్తుంది. షియోమి మి10 ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4,780mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. మి10 30W వైర్డ్ ఫ్లాష్ ఛార్జ్ మరియు 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌ టెక్నాలజీతో పాటు 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది హోమ్ వైర్‌లెస్ నెట్‌వర్క్‌ల యాక్సిస్ కోసం తాజా వై-ఫై 6 మద్దతుతో వస్తుంది. ఇది Wi-Fi 802.11ac యొక్క Wi-Fi 5 అప్‌గ్రేడ్ వెర్షన్ అని కూడా పిలుస్తారు. ఫోటోగ్రఫీ విషయానికొస్తే షియోమి Mi 10 ఫోన్ యొక్క వెనుకవైపు మొత్తంగా నాలుగు కెమెరాల సెటప్‌ను కలిగి ఉంటుంది. కొత్తగా ప్రారంభించిన షియోమి Mi 10 స్మార్ట్‌ఫోన్‌ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది శామ్సంగ్ నుండి ఐసోసెల్ బ్రైట్ HMX సెన్సార్‌ను ఉపయోగించబడి వస్తుంది. వెనుక కెమెరా సెటప్‌లోని మిగిలిన మూడు కెమెరాలలో వరుసగా 13 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెన్సార్లను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్, OIS , EIS వంటి మద్దతులు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియోల కోసం ఫోన్ ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెన్సార్‌తో సెల్ఫీ కెమెరా ప్యాక్ చేయబడి వస్తుంది. Mi 10 యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 5G , వై-ఫై 6, బ్లూటూత్, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ GPS, హై-రెస్ ఆడియో, ఎన్‌ఎఫ్‌సి మరియు ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్ వంటివి ఉన్నాయి.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM