చిరంజీవికి వైసీపీలో కీలక పదవి.. జగన్ మోదీ భేటీలో చర్చ..?

by సూర్య | Wed, Feb 12, 2020, 06:09 PM

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారా ..? జగన్ ప్రభుత్వంలో ఆయనకు రాజ్యసభ సీటు దక్కబోతోందా ..? ఇలా అనేక ఊహాగానాలు ఏపీ రాజకీయాల్లో చాలాకాలం నుంచి చర్చ జరుగుతూనే ఉంది. దీనికి కారణం ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చిరంజీవి జగన్ కు అనుకూలంగా మాట్లాడుతూ అవకాశం దొరికినప్పుడల్లా జగన్ పరిపాలన పొగుడుతూ వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సమస్యలను చిరంజీవి జగన్ వద్ద ప్రస్తావించినప్పుడు జగన్ సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. మీరు ఏది చెబితే అది అన్నా అంటూ జగన్ తనకు గౌరవం ఇచ్చారని చిరంజీవి కూడా పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు.
ఇక వైసీపీకి జనసేన పార్టీ ప్రధాన రాజకీయ శత్రువుగా మారడంతో పవన్ ని కట్టడి చేసేందుకు జగన్ దగ్గర చేసుకుంటున్నారనే విశ్లేషణలు కూడా వచ్చాయి. దీంతో చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇదే విషయమై కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీతో భేటీ అయిన ఏపీ సీఎం జగన్ రాజ్యసభ సీటు ఇచ్చే విషయమై మోదీతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఎలాగూ వైసీపీని కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటున్నారు కనుక ఆ కోటలో చిరంజీవికి కేంద్ర పర్యాటక మంత్రిగా కానీ, సహాయ మంత్రిగా కానీ అవకాశం ఇచ్చే విషయం పైన కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇదే సమయంలో చిరంజీవి కాకపోతే మోహన్ బాబు కి ఆ అవకాశం దక్కుతుందని వైసీపీలో కీలక నాయకులు మధ్య చర్చ జరుగుతోంది. చిరంజీవిని రాజ్యసభ కోటాలో కేంద్ర మంత్రిని చేయడం ద్వారా ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి కూడా వైసీపీ ప్రభుత్వం తో కలిసి పని చేసేందుకు, రాజ్యసభ సీటును తీసుకునేందుకు సుముఖంగా ఉండడంతో మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. చిరంజీవి కేంద్ర మంత్రి అయితే ఏపీ రాజకీయాల్లో వైసీపీ ప్రభుత్వం క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే జనసేన పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం కూడా లేకపోలేదు.

Latest News

 
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం, నిందలు.. సీఎం జగన్‌కు వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ Thu, Apr 25, 2024, 07:15 PM
వైసీపీ ఎమ్మెల్యే నామినేషన్‌ ర్యాలీలో అపశృతి.. మంటల్లో కాలిపోయిన టీడీపీ కార్యకర్త ఇల్లు Thu, Apr 25, 2024, 07:10 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. భారీగా నామపత్రాలు దాఖలు Thu, Apr 25, 2024, 07:06 PM
రూ.కోటి లోపు ఆస్తి ఉన్న అభ్యర్థులు ఎవరో చుద్దాం రండి Thu, Apr 25, 2024, 07:04 PM
నో యువర్‌ క్యాండిడేట్‌ ద్వారా అన్ని వివరాలు అందుబాటులోకి Thu, Apr 25, 2024, 06:57 PM