ఏపీలో ఆటోమ్యూటేషన్ సేవలు ప్రారంభం

by సూర్య | Wed, Feb 12, 2020, 04:47 PM

ఏపీలో ఆటో మ్యూటేషన్ సేవలు ప్రారంభమయ్యాయి. ఆటో మ్యూటేషన్ సేవలు అంటే భూ యాజమాన్య హక్కుల మార్పిడి అని అర్థం. ఇప్పటి వరకు రైతులు,ఇతరులు తమ భూములను అమ్మినా,కొన్నా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఎమ్మార్వో ఆఫీసులు చుట్టూ, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేంది. అంతే కాకుండా అధికారులకు లంచాలు కూడా ఇవ్వాల్సి వచ్చేది. ఇక నుంచి అటువంటి వాటికి తావు లేకుండా 30 రోజుల్లోనే నేరుగా రిజిస్ట్రేషన్ పత్రాలు ఇంటికి వచ్చే విధానాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.
భూ రిజిస్ట్రేషన్ మొదలు, ఈ-పాస్‌బుక్ జారీ వరకు మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరిగిపోతుంది. అందువల్ల ఇకపై భూ పట్టాదారులు ఆన్‌లైన్ భూ మార్పుల (బదలాయింపు) కోసం తహశీల్దారు ఆఫీస్, మీ సేవా కేంద్రాలకు వెళ్లి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయించాల్సిన పనిలేదు. వెన్యూ రికార్డుల ఆన్‌లైన్ భూమి మార్పు కోసం ఎలాంటి డబ్బూ చల్లించక్కర్లేకుండా భూ రికార్డుల మార్పిడి నమూనా (ROR 1B) వివరాలు ఆన్‌లైన్‌లో రెవెన్యూ శాఖకు వెళ్తాయి. అలా అక్కడ అవి రికార్డై... ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచైనా చూసుకోవడానికి, చెక్ చేసుకోవడానికీ వీలవుతుంది.
ఇకపై భూ బదలాయింపు ప్రక్రియ ప్రతి దశకు సంబంధించిన అప్‌డేట్స్... పట్టాదారు మొబైల్ నంబర్‌కి SMS ద్వారా అందుతుంది. 30 రోజుల్లో తహశీల్దార్ ధ్రువీకరణ, తర్వాత రెవెన్యూ రికార్డుల్లో ROR 1Bలో పర్మనెంట్‌గా నమోదవుతుంది. తద్వారా ఈ-పాస్‌బుక్ వెంటనే పొందడానికి వీలవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా భూముల అమ్మకాాలు,కొనుగోలు ప్రక్రియ సులువుగా జరగనుంది. ఎటువంటి అవినీతికి తావులేకుండా ఈ విధానాన్ని ఆమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM