ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు

by సూర్య | Wed, Feb 12, 2020, 01:22 PM

ఏపీలో జగన్ సర్కార్  మరో పథకానికి రూపకల్పన చేపడుతోంది. ఇప్పటికే అనేక పథకాలు ప్రారంభించిన జగన్ సర్కార్ మరో నూతన పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను ఆసాంతం సమూలంగా మార్చాలని ప్రవేశపెట్టిన నాడూ నేడూ పధకంతో పాటు జగనన్న అమ్మఒడి వంటి పథకాలను ప్రారంభించారు. ఇప్పుడు జగనన్న విద్యా కానుక పేరుతో మరో కొత్త పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యనభ్యసించే విద్యార్థికి ఒక స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫాం, రెండు జతల బూట్లు, నోట్ బుక్స్ ఇవాలని ప్రభుత్వం యోచన చేస్తోంది.
రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో విచారణను వేగంగా పూర్తి చేసేందుకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఎర్రచందనం దొంగతనాల కేసులో విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతిలో ఏర్పాటు చేసేలా మంత్రి వర్గం ముందుకు ప్రతిపాదనలొచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ర్యాలీల పై నమోదైన కేసులను రద్దు చేయాలనే ప్రతిపాదన మంత్రి వర్గానికి పంపారు.
కేంద్రంలో ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరహాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు చేసేలా ప్రత్యేకంగా ముసాయిదా బిల్లును ప్రభుత్వం రూపొందించగా మంత్రి వర్గంలో ఆమోదం పొందితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వ యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ 27 రోజుల వరకు ఉండగా ఇక పై 20 రోజులకే కుదించాలని మునిసిపల్ శాఖ నుంచి మంత్రి వర్గం ఆమోదం కోసం ప్రతిపాదన వెళ్ళింది. కొత్తగా ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా దీనిని ఏర్పాటు చేయటం ద్వారా 10,000 ల మెగావాట్ల విద్యుత్ ను సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా నిర్దేశించారు అధికారులు.ఇవాళ జరిగే మంత్రి వర్గ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే సీఎం జగన్ ఢిల్లి పర్యటణలో మోదీని కలిసి బడ్జెట్ లో రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించక పోవడం పై మరియు రైల్వే ప్రాజెక్టుల పై కూడా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM