వృద్ధులు, దివ్యాంగులు మానసికంగా కుంగిపోతున్నారని ఆవేదన

by సూర్య | Tue, Feb 11, 2020, 07:55 PM

నిరాదరణకు గురైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల పింఛన్లను తొలగించడం దుర్మార్గమని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోట్లకు పడగలెత్తిన ముఖ్యమంత్రి జగన్‌.. పేదల నోటికాడ కూడు లాగేయడం దుర్మార్గమన్నారు. పింఛన్ల తొలగింపుపై ఎవరిని ప్రశ్నించాలో తెలియక వృద్ధులు, దివ్యాంగులు మానసికంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు తొలగించిన వృద్ధులను చూసి ఓ మహిళా తహసీల్దారు.. తానేమీ చేయలేనంటూ కంటతడి పెట్టడం చూస్తుంటే ప్రభుత్వం పనితీరు అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో సుమారు ఏడు లక్షల పింఛన్లు అన్యాయంగా తొలగించారని, తక్షణమే వాటిని తిరిగి కొనసాగించాలని వర్ల ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM