ఫిబ్రవరి 20న ఏపీ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

by సూర్య | Tue, Feb 11, 2020, 03:39 PM

ఏపీ ఎంసెట్‌-2020 షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 20న నోటిఫికేషన్‌ విడుదలతో ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, ఎంసెట్‌- 2020 కమిటీ చైర్మన్‌ రామలింగరాజు, ఎంసెట్‌-2020 కమిటీ కన్వీనర్‌ వి.రవీంద్ర షెడ్యూల్ కు సంబంధించిన వివరాలు తెలిపారు.
దరఖాస్తులను ఫిబ్రవరి 26 నుంచి మార్చి 27 వరకు ఆన్ లైన్ లో స్వీకరిస్తారు.
రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుకు అవకాశం.
రూ.1000 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 9 వరకు దరఖాస్తుకు అవకాశం.
రూ. 5000 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 14 వరకు దరఖాస్తుకు అవకాశం.
రూ.10 వేల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏప్రిల్ 16 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఎంసెట్‌-ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష ఏప్రిల్‌ 20, 21, 22, 23 తేదీల్లో జరగనుంది.
ఎంసెట్‌-అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్ష ఏప్రిల్‌ 23-24 తేదీల్లో జరగనుంది.ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ ఈ రెండు స్ట్రీమ్‌లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్‌ 22-23 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఎంసెట్‌ ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో జరుగుతుంది.
ఎంసెట్‌ రాయదలచుకున్న అభ్యర్థులు ఒక స్ట్రీమ్‌కు అయితే రూ.500, రెండు స్ట్రీమ్‌లకు అయితే రూ.1000 ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ సారి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలు కానుంది. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వర్తిస్తుంది.

Latest News

 
పాతపట్నం నుండి వైసీపీలోకి భారీగా చేరికలు Wed, Apr 24, 2024, 08:18 PM
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలోకి క్యూ కట్టిన ప్రతిపక్ష నేతలు Wed, Apr 24, 2024, 08:17 PM
రణస్ధలం నుండి వైసీపీలోకి వలసలు Wed, Apr 24, 2024, 08:16 PM
మహిళలకి ప్రాధాన్యత ఇచ్చింది జగన్ మాత్రమే Wed, Apr 24, 2024, 08:15 PM
లక్ష పుస్తకాలు చదివిన దత్తపుత్రుడికి ఆమాత్రం తెలియదా...? Wed, Apr 24, 2024, 08:15 PM