పదవ తరగతి విద్యార్థులకు వయసు తిప్పలు

by సూర్య | Tue, Feb 11, 2020, 02:11 PM

టెన్త్ విద్యార్ధులకు వయసు తిప్పలు తప్పడం లేదు. టెన్త్ పరీక్షలకు హాజరయ్యే స్టూడెంట్స్ కు అవసరమైన వయసు లేకపోవడంతో వారిని ఎగ్జామ్స్ కు అనుమతించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సెస్సీ బోర్డుతో పాటు డీఈవో కార్యాలయాలు చుట్టు తిరిగి అనుమతులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ప్రతి యేడాది ఈ సంఖ్య వేలల్లో ఉంటుందని.. ఈ యేడాది 13 వందల 94 మంది విద్యార్థులు ఉన్నారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్ సత్యానారాయణ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2019 ఆగష్టు 30వ తేదీ నాటికి 14ఏళ్లు పూర్తయిన విద్యార్థులే టెన్త్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అయితే నిబంధనల ప్రకారం వయసు తక్కువ ఉన్నవారు 13 వందల 94 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో వేయి మంది స్టూడెంట్స్ కేవలం ఆరు రోజులు మాత్రమే తక్కువుగా ఉన్నవారు విశేషం. మిగిలిన వారు 7 నుంచి 27 రోజులు తక్కువు వయసుతో ఉన్నారని ప్రభుత్వ పరీక్షల విభాగం లెక్కలు వేసింది. వీరంతా ప్రత్యేక అనుమతి చేసుకోవడంతో విద్యాశాఖ కార్యదర్శి అనుమతించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో 1394 మంది విద్యార్థులు ఊపిరి పిల్చుకున్నారు.

Latest News

 
మాధవరం-1లో బస్సు, లారీ ఢీ Wed, Apr 24, 2024, 10:30 AM
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM