హైపవర్ కమిటి ఈమెయిల్ హ్యాక్ చేశారు: బొత్స

by సూర్య | Fri, Jan 17, 2020, 07:51 PM

హైపవర్ కమిటి భేటి తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. రాజధాని రైతుల సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైతు ప్రయోజనాలకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. అన్ని భనవాలను కూడా ఉపయోగించుకుంటామని అన్నారు. రాజధాని అంటే కేవలం 29 గ్రామాల ప్రజల ప్రయోజనాలే ముఖ్యం కాదన్నారు. అన్ని జిల్లాల అభివృద్ది కోసం సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. హైపవర్ కమిటీ ఈమెయిల్ ను ఎవరో హ్యాక్ చేశారని చెప్పారు. ఈమెయిల్ హ్యాక్ చేశారన్న బొత్స వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Latest News

 
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM
స్వచ్చందంగా రాజీనామా చేశామంటున్న వాలెంటర్లు Wed, Apr 24, 2024, 01:38 PM
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి Wed, Apr 24, 2024, 01:35 PM