ఏపీపీఎస్సీలో జగన్ ప్రభుత్వం కీలక సంస్కరణలు

by సూర్య | Fri, Jan 17, 2020, 12:08 PM

ఏపీపీఎస్సీలో జగన్ ప్రభుత్వం సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ప్రశ్నాపత్రం లీకేజీ వంటికి తావు లేకుండా ప్రిటింగ్ విధానానికి స్వస్తి పలుకుతోంది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ట్యాబ్‌ల ద్వారా ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నారు. ట్యాబ్‌ల క్వశ్చన్ పేపర్ విధానాన్ని ఫిబ్రవరి 4 నుంచి 16వరకు జరగనున్నగ్రూప్‌–1 మెయిన్స్ ఎగ్జామ్స్ నుంచి అమల్లో పెడుతున్నారు. ఈ ఏడాది హైదరాబాద్ లో కూడా మెయిన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.


ఏపీపీఎస్సీ తీసుకున్న కీలక నిర్ణయాలు...


- క్వశ్చన్ పేపర్ లేకుండా ట్యాబ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ప్రశ్నలు.. లీకేజీ విధానానికి స్వస్తి.


- పరీక్షల సమయానికి ప్రశ్నాపత్రాల అప్‌లోడ్‌.


- ట్యాబ్‌ల క్వశ్చన్ పేపర్ విధానాన్ని ఫిబ్రవరి 4 నుంచి 16వరకు జరగనున్నగ్రూప్‌–1 మెయిన్స్ ఎగ్జామ్స్ నుంచి అమలు.


- వెబ్‌సైట్‌లో యూజర్‌ మాన్యువల్‌ విడుదల.


- హైదరాబాద్‌లోనూ ఎగ్జామ్ కేంద్రాలు ఏర్పాటు.


- గ్రూప్‌–1 అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లాగానే ట్యాబ్‌లను అందిస్తారు. వారికి ఇచ్చిన పాస్‌వర్డ్‌ ద్వారా ట్యాబ్ ఓపెన్ అవుతుంది. పరీక్ష సమయానికి ముందు - మాత్రమే ప్రశ్నపత్రాలు వారి ట్యాబ్‌లలో అప్‌లోడ్‌ అవుతాయి. ముందే ఓపెన్ చేయడానికి ప్రయత్నించినా ఓపెన్ కావు.


- క్వశ్చన్స్ జంబ్లింగ్ విధానంలో ఉంటాయి.


- ప్రశ్నపత్రాల బాధ్యత ప్రతిష్టాత్మక ఐటీ సంస్థలకు అప్పగింత.


- అనుమానాలకు తావు లేకుండా క్వశ్చన్ పేపర్ డిజిటల్ మూల్యాంకానికి ఏపీపీఎస్సీ చర్యలు.


- అభ్యర్థుల ఆన్సర్ షిట్స్ స్కాన్ చేసి కంప్యూటర్లలో భద్రం.


- ఏయే ప్రశ్నకు ఏన్ని మార్కులు వేయాలో ముందుగానే నిపుణుల ద్వారా నిర్ణయం. మార్కులను సరిగా వేసారా..? లేదా..? అనేది అభ్యర్థి తర్వాత చెక్       చేసుకునేందుకు వెసులుబాటు.


- క్వశ్చన్ పేపర్ ను ముందుగా ఇద్దరు దిద్దుతారు. ఇద్దరు ఇచ్చే మార్కుల మధ్య 50 శాతం అంతకు మించి వ్యత్యాసం ఉంటే మూడో వ్యక్తిచే మూల్యంకనం.


- పేపర్ కరెక్షన్ టైంలో ఆన్‌లైన్లో ఆటోమేటిగ్గా కౌంటింగ్ అవుతుంది. మార్పు చేసేందుకు వీలు ఉండదు.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM