ప్రజారాజ్యం బాటలో జనసేన: వైసీపీ ఎమ్మెల్యే

by సూర్య | Thu, Jan 16, 2020, 06:32 PM

ఏపీలో బీజేపీ, జనసేన పొత్తుపై అధికార వైసీపీ స్పందించింది. ప్రజారాజ్యం బాటలోనే జనసేన కూడ కాలగర్భంలో కలసిపోతుందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా, వ్యక్తిగతంగా స్థిరత్వం లేని వ్యక్తి అని తీవ్ర స్థాయిలో అంబటి విమర్శలు గుప్పించారు. పవన్ ఏ పార్టీతోనూ కుదురుగా ఉండరని.. బీజేపీతో పొత్తు కూడ గ్యారంటీ లేదని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై బీజేపీని నిలదీయాల్సింది పోయి.. ఆ పార్టీతోనే చేతులు కలుపుతారా..? అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. బీజేపీ కుక్క తోక పట్టుకుని గోదారి ఈదుతుంటే మాకెందుకు అభ్యంతరమని అంబటి విమర్శించారు. గతంలో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్న పవన్ కళ్యాణ్ కు .. ఇప్పుడు కొత్తగా లడ్డూలు ఏమైనా ఇచ్చారా అంటూ సెటైర్లు వేశారు.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM