మాతో కలిసి పనిచేయడానికి జనసేన ముందుకు వచ్చింది : కన్నా

by సూర్య | Thu, Jan 16, 2020, 03:44 PM

అమరావతి : బీజేపీ-జనసేన ఉమ్మడి సమావేశం ముగిసింది. ఏపీలో ఇకపై ఇరు పార్టీలూ కలిసి నడవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా అత్యంత కీలకమైన రాజధాని విషయంపై కూడా వీరు ఓ స్పష్టతకు వచ్చారు. అమరావతే రాజధానిగా కొనసాగాలని, ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకించాలని ఇరువురూ ఓ ఏకాభిప్రాయానికి వచ్చారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్తంగా గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ... మాతో కలిసి పనిచేయడానికి జనసేన ముందుకు వచ్చిందని అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం బీజేపీ- జనసేనతోనే సాధ్యమని, ఇరువురం కలిసి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని స్పష్టం చేశారు. 2024 అధికారమే లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నామని తెలిపారు. వైసీపీ నియంతృత్వ వైఖరిపై గతంలో టీడీపీ చేసిన అవినీతిపై కలిసి పోరాడతామని కన్నా ప్రకటించారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM