నేడు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు అమరావతిలో భేటీ

by సూర్య | Thu, Jan 16, 2020, 12:25 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎస్‌లు ఈరోజు సమావేశంకానున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌ల సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎస్‌ల భేటీ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ భేటీలో గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయం చర్చలు జరగనున్నాయి. అలాగే ముఖ్యంగా 9, 10 షెడ్యూల్‌లోని అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, విద్యుత్ ఉద్యోగుల విభజన, ఏపీ పౌర సరఫరాల శాఖకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన క్యాష్ క్రెడిట్, పోలీసు ఉద్యోగుల ప్రమోషన్లు, ఉద్యోగుల అంతర్‌రాష్ట్ర బదిలీలు, తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ భేటీ అనంతరం ఏపీ అధికారుల బృందం కూడా హైదరాబాద్‌లో తెలంగాణ అధికారులతో చర్చించనుంది.

Latest News

 
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM
ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన.. జడ్జి ముందు చంద్రబాబు ప్రమాణం Tue, Apr 23, 2024, 09:00 PM
ఏపీ ఎన్నికల ప్రచారంలో ట్విస్ట్.. చంద్రబాబుపై చర్యలకు ఈసీకి సిఫార్సు Tue, Apr 23, 2024, 08:55 PM
అనంతపురం జిల్లా టీడీపీ అభ్యర్థులకు నేడు బీ.ఫామ్స్ అందించిన చంద్రబాబు Tue, Apr 23, 2024, 08:09 PM