వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన పెను ముప్పు

by సూర్య | Thu, Jan 16, 2020, 08:03 AM

చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు కడప జిల్లాలోని ఓబులవారిపల్లె వద్దకు రాగానే పట్టా విరిగినట్టు గుర్తించి నిలిపివేశారు. అనంతరం రైల్వే సిబ్బందికి సమాచారం అందించడంతో వారొచ్చి మరమ్మతులు చేపట్టారు. ఆ తర్వాత రైలు బయలుదేరింది.విరిగిన పట్టాను గుర్తించకుంటే పండుగ వేళ పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. మరమ్మతుల కారణంగా రైలు దాదాపు గంటపాటు నిలిచిపోయింది. ప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM