ఎస్వీబీసీ చైర్మన్ గా జర్నలిస్ట్ స్వప్న..?

by సూర్య | Mon, Jan 13, 2020, 05:57 PM

లైంగిక వేధింపులతో ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా చేశారు. దీంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ కు కొత్త చైర్మన్ ఎంపిక పై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఎస్వీబీసీ కొత్త చైర్మన్ ఎంపికపై స్పష్టత రాకపోయినా కానీ ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కూడ వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డారు. వీరిలో ప్రముఖ జర్నలిస్ట్ స్వప్న ముందున్నట్లు తెలుస్తోంది. స్వప్న ఎంపిక దాదాపు ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికి .. వైఎస్సార్ కు అత్యంత సన్నిహితుడైన డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పేరును కూడ సీఎం జగన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం ఎస్వీబీసీలో స్వప్న, శ్రీనివాసరెడ్డిలు ఇద్దరు కూడా డైరక్టర్లుగా పనిచేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వీరిరువురికి ఎస్వీబీసీలో డైరెక్టర్లుగా స్థానం కల్పించారు. ఇప్పటికే తిరుమల పవిత్రతను ఏపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా పృథ్వీ ఎపిసోడ్ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితిని తెచ్చి పెట్టింది. దీంతో తిరుమలలో పదవుల ఎంపికపై ఇక ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మగవారి కంటే మహిళనే ఎస్వీబీసీ చైర్మన్ గా నియమిస్తే బాగుంటుందన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం.


గతంలో జర్నలిస్ట్ స్వప్న సాక్షి ఛానెల్లో పనిచేసింది. ముఖ్యమంత్రి జగన్ కుటుంబంతో స్వప్నకు మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుతం ఆమె ఓ ఛానెల్లో పనిచేస్తోంది. వివాదరహితురాలిగా ఉన్న స్వప్నకు వివిధ భాషలపై పట్టు ఉంది. సంగీతం, సాహిత్యంలలో ఆరితేరిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. సీనియర్ పాత్రికేయురాలుగా ఉన్న స్వప్నకు అవకాశం ఇస్తే తన ఆధ్వర్యంలో ఎస్వీబీసీ మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉందని టీటీడీ బోర్డు వర్గాలు కూడ భావిస్తున్నాయట. అయితే ఇద్దరు కూడ వైఎస్ కుటుంబానికి సన్నిహితులే కావడంతో ముఖ్యమంత్రి జగన్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Latest News

 
ఓటరు సాయానికి ‘వీహెచ్‌ఎస్‌’ Thu, Apr 25, 2024, 06:46 PM
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలు నిర్వహించండి Thu, Apr 25, 2024, 06:45 PM
వైసీపీ బీజేపీతో అంటకాగుతుంది Thu, Apr 25, 2024, 06:45 PM
రాష్ట్రానికి టీడీపీ అవసరం ఎంతైనా ఉంది Thu, Apr 25, 2024, 06:44 PM
ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్‌ Thu, Apr 25, 2024, 06:43 PM