అమరావతి పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

by సూర్య | Mon, Jan 13, 2020, 04:22 PM

కొన్నిరోజులుగా ఏపీ రాజధాని అమరావతిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నాలుగు వారాలుగా నిత్యం అక్కడ ఆందోళనలు చేపడుతున్నారు. రాజధాని తరలింపుపై రైతులు భగ్గుమంటున్నారు. రాజధాని కోసం తాము చేసిన భూ త్యాగం వృథా పోవాల్సిందేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, అమరావతిలో పలు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 చట్టం విధించారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు నమోదు చేసిన హైకోర్టు, రాజధానిలో పోలీసు చట్టాల అమలుపై అసంతృప్తి వెలిబుచ్చింది. రాజధానిలో పరిస్థితులకు సంబంధించి పిటిషనర్లు ఇచ్చిన దృశ్యాలను న్యాయమూర్తి పరిశీలించారు. పూర్తి వివరాలతో శుక్రవారం ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM