ముగిసిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్

by సూర్య | Mon, Jan 13, 2020, 04:04 PM

ఏపీలో రాజధాని మార్పుపై ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన ముగిసింది. మూడు రాజధానులతో పాటు రైతుల ఆందోళనలను ప్రధాని మోడీతో పాటు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ భావించారు. వారి అపాయింట్ మెంట్ లభించలేదు. దీంతో నిన్న ఆర్ఆర్ఎస్ పెద్దలతో జనసేనాని సమావేశమయ్యారు. ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్ లో బీజేపీతో కలిసి పనిచేసే అంశంపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. నడ్డాతో జరిగిన చర్చల్లో బీజేపీతో పొత్తుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపినట్లు సమాచారం.


భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో కలసి పోటీచేయాలని ఇరు పార్టీల నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన ముగించుకున్న జనసేనాని నేరుగా కాకినాడకు వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ పై కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో జనసేన, వైసీపీ వర్గాల మధ్య నిన్న పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రాళ్లదాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్ పరామర్శించనున్నారు.

Latest News

 
శ్రీశైలంలో సామూహిక అభిషేకాలు, అర్చనలు నిలుపుదల Thu, Mar 28, 2024, 03:09 PM
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM
శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 Thu, Mar 28, 2024, 02:13 PM
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM