ముగిసిన హైపవర్ కమిటీ భేటీ

by సూర్య | Mon, Jan 13, 2020, 02:18 PM

రాజధాని అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీ ముచ్చటగా మూడోసారి సమావేశమైనా ఏమీ తేల్చకుండానే ముగించింది. సంక్రాంతి అనంతరం ఈ నెల 17న మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించింది. విజయవాడలోని ఆర్టీసీ సమావేశ మందిరంలో భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ రైతులు ఏమైనా చెప్పదల్చుకుంటే వారి నుంచి లిఖిత పూర్వకంగా తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ విజ్ఞాపనలను రైతులు నేరుగా సీఆర్డీఏ కమిషనర్ కు  అందించినా పర్వాలేదని, ఆన్ లైన్లో ఇచ్చినా సరిపోతుందని తెలిపారు. కాగా, ఈ భేటీలో రాజధాని అంశంపై ప్రభుత్వం చేయనున్న ప్రతిపాదనలపై కమిటీ చర్చించింది. ఇంతకు ముందు జరిగిన రెండు సమావేశాల్లో రైతుల ఆందోళన, సచివాలయం ఉద్యోగుల డిమాండ్ల పై చర్చించారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM