ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల ఆందోళన

by సూర్య | Mon, Jan 13, 2020, 12:52 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే గతంలో 34 ఏళ్ల వయోపరిమితి ఉండాలనే నిబంధన ఉండేది. ఏళ్ల తరబడి నియామకాలు లేనందున.. నిరుద్యోగులకు మేలు చేకూరేలా వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ అప్పటి సీఎం చంద్రబాబు వయోపరిమితి సడలించారు.


ఏపీపీఎస్సీ, ఇతర ఏజెన్సీల ద్వారా ఏపీలో భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు వయో పరిమితి 42 ఏళ్ల వరకు పెంచారు. దీనిని 2019 సెప్టెంబర్ 30 వరకు కొనసాగించేలా 2018 అక్టోబర్ 15 న జీవో 132 విడుదల చేశారు. ఆ ఉత్తర్వులు అమల్లో ఉన్నందున 2019 సెప్టెంబర్ లో సచివాలయ ఉద్యోగాల భర్తీ చేపట్టినప్పుడు 42 ఏళ్ల వయోపరిమితిని పాటించారు. ఈ వయోపరిమితోనే లక్షకు పైగా పోస్టులు భర్తీ చేశారు.


అయితే తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలకు వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతామంటూ అప్పట్లోనే ప్రస్తుతం ఉన్న సీఎం జగన్ యువతకు హామీ ఇచ్చారు. ఆ మేరకు వయోపరిమితి 46 ఏళ్లకు పెంచుతూ కొన్నాళ్లు ప్రభుత్వ శాఖల్లో ఫైల్ నడిచింది. ఇది సీఎం వద్ద 2019 సెప్టెంబర్ 26 నుంచి పెండింగ్ లో ఉంది. దీంతో పాటు అటు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 42 ఏళ్లకు పెంచుతూ ఇచ్చిన జీవోకు కాలం తీరిపోవడం.. ఇటు ప్రస్తుతం ఉన్న సీఎం జగన్ వయోపరిమితి పెంపు ఫైలును పెండింగ్ లో పెట్టడంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2020 జనవరి 10న గ్రామ.. వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 15 వేల పైచిలుకు పోస్టులకు పంచాయతీ రాజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ లో వయోపరిమితి మళ్లీ 42 ఏళ్లుగానే పేర్కొంది.


గతంలో 42 ఏళ్లకు వయోపరిమితి కొనసాగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు గత ఏడాదిలోనే ముగిశాయి. 42 ఏళ్ల వయోపరిమితిని కొనసాగిస్తూ సర్కార్ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకుండానే తాజా నోటిఫికేషన్ ఇవ్వడంపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నోటిఫికేషన్లు జారీ చేస్తే కోర్టుల్లో చుక్కెదురయ్యే పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. ఏపీ సర్కార్ వెంటనే స్పందించి గతంలో ఉన్న ఉత్తర్వులను కొనసాగిస్తూ ఆదేశాలివ్వాలని.. లేక సీఎం జగన్ 46 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేట్లయితేనే కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేయాలని కోరుతున్నారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM