ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ పై విచారణ ప్రారంభం

by సూర్య | Sun, Jan 12, 2020, 05:22 PM

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ రాసలీలల సంభాషణ బయటపడ్డ విషయం తెలిసిందే. ఎస్వీబీసీ ఉద్యోగినితో పృథ్వీరాజ్ అసభ్యంగా మాట్లాడిన ఆడియో టేపు సంచలనంగా మారింది. దీనిని సీరియస్ గా తీసుకున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణకు ఆదేశించారు. సాయంత్రంలోగా నివేదికను ఇవ్వాలని విజిలెన్స్ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అలర్ట్ అయిన విజిలెన్స్ అధికారులు దీని పై విచారణ ప్రారంభించారు. ఆదివారం మధ్యాహ్నం విజిలెన్స్ అధికారులు అలిపిరి వద్ద ఉన్న ఎస్వీబీసీ కార్యాలయానికి చేరుకున్నారు. తోటి ఉద్యోగుల పట్ల పృథ్వీరాజ్ ప్రవర్తించిన తీరు పై వారు విచారణ చేస్తున్నారు. అందరిని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. పృథ్వీ తప్పు చేసినట్టు తేలితే అతని పై చర్యలు తప్పవని తెలుస్తోంది. పృథ్వీ పదవి పోవడం ఖాయమన్న చర్చ జోరుగా జరుగుతోంది. మరో వైపు దీనిని సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి పృథ్వీ పై చర్యలకు రంగం సిద్దమైందని సమాచారం. ఆయనది తప్పని తేలితే పదవి ఊడిపోవడం ఖాయమని అధికార పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.


మహిళా ఉద్యోగితో పృథ్వీ ఏమని మాట్లాడారంటే...నువ్వంటే ఇష్టం..నువ్వు నా గుండెల్లో ఉన్నావు.. వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుందామనుకున్నా… అంటూ పృథ్వీ ఆ మహిళతో రాసలీలల సంభాషణ చేశాడు. ఆ మహిళ కూడా అంతే ఇదిగా ఫోన్ లో సమాధానమిచ్చింది. నువ్వు వెనుక నుంచి పట్టుకున్నా నేను అరవను.. ఎందుకంటే నువ్వు తెలుసు కదా.. అని ఆ మహిళ సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఈ ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది మహిళ కావాలని చేసినట్టుగా ఉందని మరికొంత మంది అనుమానిస్తున్నారు.

Latest News

 
సత్యప్రసాద్ నామినేషన్ కు ప్రజలు భారీగా తరలి రావాలి Wed, Apr 24, 2024, 01:14 PM
పొగాకు అత్యధిక ధర రూ. 270 Wed, Apr 24, 2024, 01:11 PM
హిల్ వ్యూ స్టేడియంలో నారాయణ సేవ Wed, Apr 24, 2024, 01:09 PM
టీవీ పగలగొట్టి ఆవేదన చెందిన టీడీపి కార్యకర్త Wed, Apr 24, 2024, 01:06 PM
రిటైర్డ్ వి ఆర్ ఓ ను పరామర్శించిన ఎమ్మెల్యే Wed, Apr 24, 2024, 01:05 PM