విచారణకు విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించాను : వైవీ సుబ్బారెడ్డి

by సూర్య | Sun, Jan 12, 2020, 04:22 PM

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ పై ఆరోపణలు తలెత్తిన విషయం తెలిసిందే. పృథ్వీ ఆడియో టేపుల వ్యవహారం గురించి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మీడియా ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ, ఈ విషయం గురించి తెలిసిన వెంటనే పృథ్వీతో మాట్లాడానని చెప్పారు. ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని, తనను అవమానించేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని, తన గొంతును ఎవరో అనుకరించిరనట్టు ఆ వీడియోలో తెలుస్తోందని పృథ్వీ తనతో చెప్పాడని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎలాంటి చర్యలు చేపడతామని ప్రశ్నించారు. దీనిపై విచారణకు విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించానని, నివేదిక అందిన తర్వాత సీఎంకు తెలియజేస్తామని అన్నారు. కాగా, పృథ్వీ వ్యవహారం గురించి ఇప్పటికే జగన్ కు తెలిసిందని, ఆయనపై చర్యలు తప్పవని సమాచారం.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM