ఇవన్నీ చూస్తూ.. మౌనంగా ఉండలేను

by సూర్య | Sun, Jan 12, 2020, 04:20 PM

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహిళలపై దాడి చేసి అరెస్టు చేయడం అన్యాయమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరీ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ సిద్ధాంతం ఏదైనా.. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై తాను ఫైట్ చేస్తానని అయన అన్నారు. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయన్నారు. రాజధాని సమస్యను సరి చేయలేకపోతే తనకు పదవులు అనవసరమన్నారు. ఇవన్నీ చూస్తూ.. మౌనంగా ఉండలేనన్నారు. కేంద్రం కూడా పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుందని ఆరు నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఆడపడుచుల పట్ల విశ్వాసం కోల్పోయిందన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి భవిష్యత్తులో మనుగడ లేదన్నారు. అవసరం లేకున్నా 144 సెక్షన్ పెడుతున్నారని, ఏ నిబంధనల ప్రకారం అర్ధరాత్రి పోలీసులు ఇళ్లకు వెళుతున్నారని ప్రశ్నించారు. ఒంగోలులో మహిళలపై మగ పోలీసులు దాడిచేయడం కలచి వేసిందన్నాఆయన కులాల మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని విమర్శించారు. పాలన వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యం కాదని అయన అన్నారు.

Latest News

 
భార్యపై అనుమానంతో భర్త దారుణం.. తల్లీపిల్లలను ఇంట్లో ఉంచి.. అసలు మనిషేనా Sat, Apr 20, 2024, 08:00 PM
చంద్రబాబు పుట్టినరోజు.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ Sat, Apr 20, 2024, 07:55 PM
రెండు దొంగ ఓట్లు వేసైనా గెలిపించండి.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్ Sat, Apr 20, 2024, 07:47 PM
చంద్రబాబును అందరూ మర్చిపోయినా, నేను మర్చిపోను: సింగర్ స్మిత Sat, Apr 20, 2024, 07:36 PM
తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు.. బంగారం ఎన్నివేల కేజీలంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏకంగా వేల కోట్లలో Sat, Apr 20, 2024, 07:31 PM