పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రోజా

by సూర్య | Sun, Jan 12, 2020, 02:30 PM

కర్నూలే రాజధానిగా కావాలని గతంలో వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు మాట మార్చారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... రాజధానిపై బీజేపీ నేతలు కూడా యూటర్న్‌ తీసుకోవడం బాధాకరమని చెప్పారు. సొంత ప్రయోజనాల కోసమే  సుజనా చౌదరి, సీఎం రమేష్‌ బీజేపీలో చేరానని, వారికి వైసీపీని విమర్శించే అర్హత లేదని ఆమె అన్నారు.


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే  ప్రజలను రెచ్చగొడుతున్నారని రోజా ఆరోపించారు. రాజధాని ప్రజలకు నష్టం చేసింది చంద్రబాబేనని, రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కున్నారని ఆమె అన్నారు. పంట భూములను తగులబెట్టి రైతులను ఆయన భయబ్రాంతులకు గురిచేశారని ఆమె చెప్పుకొచ్చారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నామని చంద్రబాబుకు ఎవరు చెప్పారని ఆమె ప్రశ్నించారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM