దేశంలో తొలి అంధ ఐఏఎస్ అధికారి

by సూర్య | Mon, Oct 14, 2019, 07:39 PM

ముంబై: మహారాష్ట్రకు చెందిన ప్రాంజల పాటిల్ దేశంలోనే తొలి అంధ ఐఏఎస్ అధికారిగా రికార్డులకెక్కారు. ఆమె నేడు కేరళ రాజధాని తిరువనంతపురం సబ్ కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ గోపాల కృష్ణన్, కలెక్టరేట్ సిబ్బంది సమక్షంలో ప్రాంజల పాటిల్ బాధ్యతలు తీసుకున్నారు. 2017 సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఆమె 124 రాంక్ సాధించి ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టరుగా పనిచేశారు. మహారాష్ట్ర ఉల్హాస్ నగర్ కు చెందిన ప్రంజల్ పాటిల్ కంటిచూపు లేకున్నా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రంజల్ పాటిల్ తిరువనంతపురం సబ్ కలెక్టర్ గా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కే గోపాలకృష్ణన్, కలెక్టరేట్ సిబ్బంది సమక్షంలో సబ్ కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్నారు. ప్రంజల్ పాటిల్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకుని..దేశంలోనే తొలి అంధ ఐఏఎస్ అధికారిణిగా రికార్డుల్లోకెక్కారు. 2017 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో ప్రంజల్ పాటిల్ 124వ ర్యాంకు సాధించారు. ఆ తర్వాత 2018లో ఆమె ఎర్నాకులమ్ అసిస్టెంట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.

Latest News

 
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM
ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన.. జడ్జి ముందు చంద్రబాబు ప్రమాణం Tue, Apr 23, 2024, 09:00 PM
ఏపీ ఎన్నికల ప్రచారంలో ట్విస్ట్.. చంద్రబాబుపై చర్యలకు ఈసీకి సిఫార్సు Tue, Apr 23, 2024, 08:55 PM