వర్ల రామయ్యకు పోలీస్ అధికారుల సంఘం వార్నింగ్

by సూర్య | Mon, Oct 14, 2019, 05:58 PM

ఏపీలో అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీస్ అధికారులపై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పోలీస్ అధికారుల జాతకాలు తన వద్ద ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం మండిపడుతోంది. ఈ నేపథ్యంలో వర్ల రామయ్యకు పోలీస్ అధికారుల సంఘం వార్నింగ్ ఇచ్చింది. వర్ల రామయ్య జాతకం తమకు తెలుసు అని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించింది. పోలీసులను దూషిస్తే న్యాయపోరాటం చేస్తాం అని, పోలీసులను కించపరిచేలా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. పోలీస్ వ్యవస్థ ఎవరికీ తలొగ్గదని, అనవసరంగా పార్టీ రంగు పులమొద్దని సూచించింది.

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM