కన్నకూతురిని కాల్చి బూడిద చేశారు

by సూర్య | Mon, Oct 14, 2019, 03:01 PM

కాలం మారుతుంది.. పద్దతులు మారుతున్నాయి. కులాల మధ్య మతాల మధ్య దూరం కూడా తగ్గుతుంది కానీ పల్లెల్లో మాత్రం ఇంకా కుల రక్కసి కోరలు చాచుకునే చూస్తోంది. కులాల కుమ్ములాటలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. కులం కాని వాడిని ప్రేమిస్తే హత్యలే శరణ్యం అవుతున్నాయి. అలా ఇలా కాదు కన్నపేగు అన్న మమకారం కూడా లేకుండా అత్యంత కిరాతకంగా కాలి బూడిద చేస్తున్నారు. కన్నవారే ఈ దారుణాలకు పాల్పడటం కలకలం రేపుతోంది. సీమ జిల్లాల్లో కుల హత్యలు పరువు హత్యలు పెట్రేగుపోతుండటం షాక్ కు గురి చేస్తున్నాయి.


నరరూప రాక్షసులు కూడా తమ బిడ్డలను ఇంత దారుణంగా చంపుకోరేమో అన్నట్టుగా కనిపిస్తోంది. ప్రేమించిన పాపానికి 18 ఏళ్లు కూడా నిండాకుండానే కాలి బూడిద అయింది చందన. కులం కాని అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న ఓకే ఒక్క కారణంతో కిరాతకంగా ప్రవర్తించారు చందన తల్లిదండ్రలు.


చిత్తూరు జిల్లా, శాంతిపురం రెడ్లపల్లెకు చెందిన వెంకటేష్‌, అమరావతి దంపతుల కుమార్తె చందన 17 ఏళ్లు.. మైనారిటీ తీరడానికి ఇంకా 11 నెలలు. అయితే ఇంతలోనే ఆకర్షణ కాస్త ప్రేమగా మారి పొరుగు గ్రామానికి చెందిన ప్రభు అలియాస్ నందన కుమార్ ను ప్రేమించి. అబ్బాయి వయసు కూడా 19 ఏళ్లే.. అబ్బాయికి కూడా ఇంకా మైనార్టీ తీరలేదు. ఒడ్డుమడికి చెందిన శ్రీనివాసులు, పద్మమ్మల కుమారుడు ప్రభు అలియాస్‌ నందకుమార్‌. అయితే నందనకుమార్ దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు కావడం ప్రేమించిన చందన బీసీ సామాజిక వర్గానికి చెందిన యువతి కావడంతో ఇంట్లో వీరి ప్రేమకు రెడ్ సిగ్నల్ పడింది.


చాలా సందర్బాల్లో చందన తల్లిదండ్రులు బంధువులు మందలించారు కూడా. అయినా వెనక్కి తగ్గకుండా ఏకంగా పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యారు ప్రేమికులిద్దరు. అనుకున్నదే తడువుగా చందనను తీసుకుని వెళ్లిన నందనకుమార్ ఈ నెల 11న కుప్పంలోని ఓ గుళ్లో స్నేహితుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో యువతి చందన తండ్రి వెంకటేష్‌ మరో ఇద్దరు గ్రామ పెద్దలను వెంటేసుకుని కుప్పం వెళ్లి గత శనివారం కుమార్తెను ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ప్రియుడుని చితకబాది తన కూతురుని తీసికెళ్లాడు వెంకటేష్.


అయితే ఆ తరువాత అన్ని సర్దుకుంటాయిలో అనుకుని ప్రభు కూడా తన సొంత గ్రామం వొడ్డుమడిలోని ఇల్లు చేరాడు. అయితే అప్పటికే పెను విషాదం చోటుచేసుకుంది. చందనను ఇంటికి తీసికెళ్లిన తండ్రి వెంకటేష్ కన్నకూతురు అని కూడా చూడకుండా ఉరి తీసి చంపేశాడు. ఆ తరువాత అమ్మాయి శవాన్ని ఊరి పొలిమేరలకు తీసుకువెళ్లి కాల్చి బూడిద చేశాడు. అంతే కాదు ఏ ఆదారం దొరకకుండా ఆ బూడిదను బస్తాల్లో నింపి పక్కనే ఉన్న చెరువు నీటిలో కలిపేశాడు. ఇక్కడే మరో దారుణం వెలుగు చూసింది. వొడ్డుమడికి చేరుకున్న ప్రియుడు ప్రభు తన తండ్రితో సహా కనిపించకుండా పోయారు. ఈ వార్త దాహనంలా వ్యాపించడంతో ప్రభును కూడా చందన తండ్రి వెంకటేష్ మాయం చేశాడని హత్య చేసి ఉంటాడన్న అనుమానాలు కలకలం సృష్టించాయి.


ప్రేమించిన పాపానికి కన్నకూతురుని పరువుకోసం హత్య చేశారని అబ్బాయి తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా.. అబ్బాయి వేధించి మరీ బలవంతంగా పెళ్లి చేసుకోవడం వల్లే తమ అమ్మాయి ఉరి పోసుకుని చచ్చిపోయిందని చందన తల్లిదండ్రులు చెపుతున్నారు. అయితే ఈ దారుణం వెనుక అనుమానాలు మరింత బలపడుతున్నాయి. రెండు కుటుంబాలు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలే. అయితే చందన సామాజిక వర్గానికి చెందిన కొందరు ఊరి పెద్దలు పగను నూరిపోయడం కారణంగానే కన్నతండ్రే చందనను పొట్టన పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రియుడు ప్రభూ కనిపించకుండా పోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఇక కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేశామని కుప్పం రూరల్‌ సీఐ కృష్ణమోహన్‌ తెలిపారు. చందన తల్లిదండ్రులను విచారించగా పనుల నిమిత్తం బయటకు వెళ్లివచ్చేసరికే తమ కుమార్తె ఇంట్లోనే ఉరివేసుకుని మృతి చెందడం గమనించినట్లు చెప్పారన్నారు. అమ్మాయి కావడంతో వివాదం ఎందుకని భావించి సమీప పొలంలోనే మృతదేహాన్ని బంధువుల సహాయంతో కాల్చివేశామని తెలిపారు. మృతదేహం బూడిదను బస్తాల్లో వేసి కర్ణాటక రాష్ట్రం కేశంబల్ల చెరువుకు తరలించారని తెలిపారు. నిందితులందరి పైనా కేసు నమోదు చేశామన్నారు. అలాగే ఒడ్డుమడి గ్రామంలో ప్రభు ఇంటికి కూడా వెళ్లాం. అయితే ప్రభు కానీ, అతని తండ్రి శ్రీనివాసులు కానీ ఆ సమయంలో అక్కడ లేరని. ఇంట్లోనే ఉన్న ప్రభు తల్లి పద్మమ్మను విచారించి ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశామని తెలిపారు. డీఎస్పీ ఆరీఫుల్లా ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.


అయితే ఈ ఘటన ఇప్పుడు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. చందన ఉరి వేసుకుని చనిపోతే తల్లిదండ్రులు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు. అటు ప్రభు అతని తండ్రి కనిపించకుండా పోయి రెండు రోజులైన వారి కుటుంబ సభ్యులకు పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు. కూతురుని చనిపోయిందని చెపుతున్న తల్లిదండ్రులు రహస్యంగా ఎందుకు చందనను కాల్చి బూడిద చేసినట్టు. రెక్కాడితే కానీ డొక్కాడని ఇరు కుటుంబాలకు పరువు , ప్రతికారాలను నూరి పోసింది ఎవరు. వారి బతుకు వారు బతుకుతారని ఇరు కుటుంబాలు ఎందుకు చందన ప్రభులను వదిలివేయలేదు. చివరికి మైనార్టీ కూడా తీరకుండానే చందన బలి అవ్వడం ప్రభు కనిపించకుండా పోవడం.. ఇలాంటి ప్రేమలనేనా కోరుకునేది. సమాజంలో ఇలాంటి దారుణాలకు హంతం లేదా.. శిక్షలు ఉండవా.. ప్రేమిస్తే చావే శరణ్యమా.. కులం కాని వాడిని ప్రేమిస్తే కాలిబూడిద కావాల్సిందేనా. ఈ పరువు హత్యలకు ఈ కులాంతర ప్రేమ దారుణాలకు హంతం ఎప్పుడో కాలమే నిర్ణయించాలి.

Latest News

 
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM