రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వ‌ర్షాలు

by సూర్య | Sun, Oct 13, 2019, 10:49 PM

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. లక్షదీవుల ప్రాంతం నుంచి కోస్తా వరకు ఉపరితలద్రోణి ఆవరించి ఉండ‌టంతో ఆగ్నేయ/దక్షిణ దిశ నుంచి కోస్తాపైకి గాలులు వీస్తున్నాయపి విశాఖ వాతావ‌ర‌ణ నిపుణులు చెపుతున్నారు. ఈ గాలుల‌ ప్రభావం కార‌ణంగా సముద్రం నుంచి వచ్చే తేమగాలులతో వాతావరణ అనిశ్చితి నెలకొంద‌ని వివ‌రించారు. ఇప్ప‌టికే ఈ గాలుల వ‌ల్ల కోస్తా, రాయలసీమల‌లో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయ‌ని తెలిపారు.


 నైరుతి రుతుపవనాల ఉపసంహరణ వేగవంతం కావడంతో రానున్న వచ్చే రెండు, మూడు రోజుల్లో ఈశాన్య రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం ఏర్పడనున్నదని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM