బసవతారకం ట్ర‌స్టీ మృతికి చంద్రబాబు, బాలకృష్ణ సంతాపం !

by సూర్య | Sun, Oct 13, 2019, 08:38 PM

న్యూయార్క్‌లో ప్రముఖ డాక్టర్‌గా పేరు పొందిన డా. తులసీ పోలవరపు మృతిపట్ల తానా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి వ్యవస్థాపకుల్లో ఆమె ఒకరు. తానా నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆమె పాలుపంచుకున్నారు. ఆమె మృతిపట్ల పలువురు తెలుగు ప్రముఖులు సంతాపం తెలిపారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వ్యవస్థాపక ట్రస్టీగా ఉన్న డాక్టర్ పోలవరపు తులసీదేవి (80) తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి స్థాపంలో కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 12వ తేదీ శనివారం న్యూయార్క్‌లోని తన నివాసంలో ఆమె కన్నుమూశారు. ఆమె మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియచేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామానికి చెందిన ఈమె..న్యూయార్క్‌లో గైనకాలజిస్టుగా స్థిరపడ్డారు. ఆమె భర్త డాక్టర్ రాఘవరావు ఆర్థోపెడిక్ సర్జన్ వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పేద రోగులకు అందుబాటు ధరల్లో చికిత్స అందించాలని, ప్రపంచ శ్రేణి క్యాన్సర్ చికిత్స కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఎన్టీరామారావు సంకల్పించారు.


 

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM