మోదీ అన్న కుమార్తె హ్యాండ్ బ్యాగ్ ను ఎత్తుకెళ్లింది వీరే

by సూర్య | Sun, Oct 13, 2019, 10:01 AM

దేశ రాజధాని ఢిల్లీలో దొంగలు రెచ్చి పోయారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్న ప్రహ్లాద్ మోదీ కుమార్తె దమయంతి బెన్ మోదీ హ్యాండ్ బ్యాగ్ నే అపహరించారు. వివరాల్లోకి వెళ్తే, ఓ పని మీద నిన్న ఉదయం ఆమె అమృత్ సర్ నుంచి ఢిల్లీకి వచ్చారు. బెన్ సివిల్ లైన్స్ లో ఉన్న గుజరాత్ సమాజ్ భవన్ లో ఓ గదిని బుక్ చేసుకున్నారు. గుజరాత్ సమాజ్ భవన్ గేటు వద్ద దిగి లోపలకు వెళ్తుండగా... ఓ బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ను లాక్కెళ్లారు. ఆ బ్యాగ్ లో రూ. 56 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, కొన్ని కీలక ప్రత్రాలు ఉన్నాయి. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఘటనాస్థలం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి నివాసానికి దగ్గర్లోనే ఉండటం గమనార్హం. చోరీకి పాల్పడ్డ దుండగుల చిత్రాలు సీసీటీవీ ఫుటేజీలో లభ్యమైంది. ఈ ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM