కోస్తా, రాయలసీమలో భారీవర్షాలు!

by సూర్య | Sun, Oct 13, 2019, 07:53 AM

ఆగ్నేయ/దక్షిణ దిశ నుంచి కోస్తాపైకి గాలులు వీస్తుండ‌టంతో లక్షదీవుల ప్రాంతం నుంచి కోస్తా వరకు ఉపరితలద్రోణి ఆవరించింది. వీటి ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలులతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. దీంతో కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ వేగవంతం కావడంతో రానున్న వచ్చే రెండు, మూడు రోజుల్లో ఈశాన్య రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం ఏర్పడనున్నదని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.


 

Latest News

 
బస్సు బోల్తా.. డ్రైవర్ తో సహా ఆరుగురుకి గాయాలు Thu, Apr 25, 2024, 12:20 PM
వైసిపి టిడిపి నుండి 60 కుటుంబాలు కాంగ్రెస్ లోకి చేరిక Thu, Apr 25, 2024, 12:18 PM
వైసిపి నుండి 10 కుటుంబాలు టిడిపిలోకి చేరుకా Thu, Apr 25, 2024, 12:10 PM
వైఎస్సార్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగభూషణ Thu, Apr 25, 2024, 12:09 PM
కొనసాగిన నామినేషన్ల పర్వం Thu, Apr 25, 2024, 12:06 PM