అక్టోబరు 29 నుంచి శ్రీ కపిలేశ్వరాలయంలో విశేషపూజ హోమ మహోత్సవాలు

by సూర్య | Sun, Oct 13, 2019, 01:39 AM

పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 29 నుంచి నవంబరు 26వ తేదీ వరకు విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగనున్నాయి. అక్టోబరు 29న గ‌ణ‌ప‌తి పూజ‌, అంకురార్పణంతో హోమ  మహోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి.అక్టోబరు 29 నుంచి 31వ తేదీ వరకు శ్రీ గణపతిస్వామివారి హోమం, న‌వంబరు 1, 2వ తేదీల్లో శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం, న‌వంబరు 2న శ్రీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామివారి కల్యాణోత్సవం, న‌వంబరు 3న  శ్రీ నవగ్రహ హోమం నిర్వహిస్తారు.


అదేవిధంగా, న‌వంబరు 4న  శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం , న‌వంబరు 5 నుంచి 13వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీహోమం), నవంబరు  14 నుంచి 24వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం), నవంబరు 25న శ్రీ కాలభైరవ స్వామివారి హోమం, నవంబరు 26న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.


కాగా, గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గ హస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ హోమాల్లో పాల్గొనే గృహస్తులు కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణలో రావాల్సి ఉంటుంది. 

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM