సమ్మె చేయడం సరైనది కాదు!

by సూర్య | Sat, Oct 12, 2019, 10:57 PM

ఆర్టీసీ కార్మికులు సమ్మెపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. సమ్మె చేయడం సరైనది కాదని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికుల డిమాండ్ సరైంది కాదని, బిజెపి పాలిత ఏ రాష్ట్రాల్లో కూడా ఆర్టీసీని ప్రభుత్వంతో విలీనం చేయలేదని ఆయన తెలిపారు. సిఎం కెసిఆర్ ఇప్పటికే ఆర్టీసీకి గతంలో ఎవరూ ఇవ్వని విధంగా 44 శాతం ఫిట్ మెంట్ (రూ.3 వేల కోట్లు) ఇచ్చారని చెప్పారు. కాగా, ప్రభుత్వం పదేపదే చెప్పినా వినకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారని మంత్రి సత్యవతి రాథోడ్ ఈ సందర్భంగా చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో విపక్షాలు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయి. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు సిఎం కెసిఆర్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చి కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే సిఎం ఉద్ధేశ్యామని, ఆర్టీసీ నాయకుల వ్యవహార శైలితో సంస్థ మరింత నష్టాల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా చెెప్పలేదని స్పష్టం చేశారు.


 

Latest News

 
శ్రీశైలంలో సామూహిక అభిషేకాలు, అర్చనలు నిలుపుదల Thu, Mar 28, 2024, 03:09 PM
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM
శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 Thu, Mar 28, 2024, 02:13 PM
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM