రాష్ట్రంలో వచ్చే ఇసుక తుపానులో సర్కారు కొట్టుకుపోవడం ఖాయం

by సూర్య | Sat, Oct 12, 2019, 08:37 PM

అడ్డగోలు ఇసుక తవ్వకాలు సాగించడం, అడ్డొచ్చిన వారిని అంతం చేసే స్థాయిలో వైసీపీ ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. ఇసుక విషంలో ప్రభుత్వం క్రియాశీలంగా వ్యవహరించకపోతే ఇసుక తుపానులో ఈ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం అని మాజీ మంత్రి కె.ఇ.కృష్ణ‌మూర్తి శ‌నివారం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సామాన్యుడికి ట్రాక్టర్‌ ఇసుక కూడా దొరకని విధంగా వైసీపీ నాయకులు ఇసుక మాఫియాను నడుపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఇసుక మాఫియాలకు డాన్‌లుగా మారారు. జగన్‌ నిరంకుశాన్ని చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు సైతం భయపడుతున్నారు. రాష్ట్రంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తల జేబులు నింపడం కోసమే ప్రభుత్వం ఇసుక కృత్రిమ కొరతను సృష్టించింది. ఇసుక కొరత తీర్చి భవన నిర్మాణ కార్మికుల అవస్థలను రూపుమాపాల్సిన ప్రభుత్వం.. ఆదిశగా కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. పైగా ఇసుక కొరత తీర్చాలని, కార్మికుల ఉపాధిని పునరుద్దరించాలని శాంతి యుతంగా నిరసన తెలిపిన టీడీపీ నాయకులపై కేసులు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన ఇసుక కృత్రిమ కొరతతో 30లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వారి ఆకలి కేకలకు ప్రభుత్వం కారణం కాదా.? ఉచితంగా అందిన ఇసుకకు వేలల్లో వసూలు చేస్తూ.. దోచుకోవడానికి ప్రభుత్వం కారణం కాదా.? ఆకలి తీర్చమంటే అరెస్టులు చేస్తారు. న్యాయం చేయమని కోరితే పోలీసులతో అక్రమంగా నిర్భంధిస్తారు. ధర్మంగా వ్యవహరించమని సూచిస్తే.. దౌర్జన్యాలకు పాల్పడతారు. ఇదేనా ప్రభుత్వ విధానం. ఇదేనా ప్రజాపరిపాలన.? ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలపై పోరాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇసుక కొరత తీర్చాలని నిరసన తెలిపితే అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశత్వ విధానానికి నిదర్శనం.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM