అద్భుతమైన ఫీచర్లతో నోకియా 6.2 ఫోన్ విడుదల

by సూర్య | Sat, Oct 12, 2019, 06:21 PM

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫోన్ల రంగంలో దూసుకుపోయిన నోకియా ఇప్పుడు పునర్వైభవం కోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తుంది. గత నెలలోనే నోకియా 7.2ను లాంచ్ చేసిన నోకియా తాజాగా శుక్రవారం భారత మార్కెట్లోకి నోకియా 6.2ను లాంచ్ చేసింది. నిజానికి ఈ ఫోన్ ను గత నెలలో బెర్లిన్ లో జరిగిన ఐఎఫ్ఏ 2019లోనే లాంచ్ చేసినా, మన దేశానికి మాత్రం శుక్రవారమే వచ్చింది.


ధర ఎంత? ఆఫర్లేంటి?


నోకియా 6.2 ధరను భారతదేశంలో రూ.15,999గా నిర్ణయించారు. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్, నోకియా అధికారిక వెబ్ సైట్లలో ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఆఫ్ లైన్ మొబైల్ స్టోర్లలో కూడా నేటి నుంచే విక్రయం ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి సెరామిక్ బ్లాక్ కలర్ వేరియంట్ ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, ఐస్ కలర్ వేరియంట్ కూడా విడుదల అవుతుంది.


అమెజాన్ లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కార్డుతో ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే.. రూ.2,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. పాత స్మార్ట్ ఫోన్ పై ఎక్స్ చేంజ్ ద్వారా మరో రూ.10,100 వరకు తగ్గింపు పొందవచ్చు. నోకియా వెబ్ సైట్ లో నవంబర్ 30 లోపు ఈ ఫోన్ ను కొనుగోలు చేసేవారికి రూ.1,500 విలువ చేసే వోచర్ లభించనుంది. ఆఫ్ లైన్ కస్టమర్లకు కూడా పలు అదనపు లాభాలు లభించనున్నాయి. ఇందులో రూ.7,200 వరకు జియో నుంచి లభించే లాభాలు కూడా ఉన్నాయి.


ఫీచర్లు...


1. 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే.


2. రక్షణగా గొరిల్లా గ్లాస్ 3


3. బ్యాటరీ సామర్థ్యం 3500 ఎంఏహెచ్


4. కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా


5. వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్ బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్, 4జీ ఎల్ టీ

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM