శివసేన మేనిఫెస్టో విడుదల

by సూర్య | Sat, Oct 12, 2019, 03:42 PM

మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శివసేన తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఓటర్లను ఆకట్టుకునే పలు ఆకర్షణీయ పథకాలతో మేనిఫెస్టోను రూపొందించింది. నాణ్యత కలిగిన పౌష్టికాహారాన్ని 10 రూపాయిలకే అందించడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా 1000 ”భోజనాలయాల”ను ఏర్పాటు చేయనున్నట్లు శివసేన పేర్కొంది. గృహాలకు విద్యుత్‌ ఛార్జీలను 300 యూనిట్ల వరకూ 30 శాతం తగ్గిస్తామని, గ్రామాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహిస్తామని, అవసరంలో ఉన్న రైతులకు ఏడాదికి లక్ష రూపాయిల ఆర్థిక సహాయం అందిస్తామని, రుణాల మాఫీ, ఎరువుల ధరలు నిర్ణయించడం తదితర పలు అంశాలను శివసేన మేనిఫెస్టోలో పేర్కొంది.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM